Defence Corridor | హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను ఆమోదించండి.. కేంద్రమంత్రికి జితేందర్‌రెడ్డి రిక్వెస్ట్
Defence Corridor | హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఏరోస్పేస్ కారిడార్‌గా అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. న్యూఢిల్లీలోని రాజ్‌నాథ్‌సింగ్ అధికారిక నివాసంలో సోమవారం ఆయనను కలిశారు.
Defence Corridor | హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఏరోస్పేస్ కారిడార్‌గా అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. న్యూఢిల్లీలోని రాజ్‌నాథ్‌సింగ్ అధికారిక నివాసంలో సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. ఆయన వెంట ఖమ్మం ఎంపీ ఆర్ రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన రక్షణ పారిశ్రామిక కారిడార్ల తరహాలో హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌కు కేంద్రం ప్రాధాన్యం, ప్రోత్సాహకాలు కల్పించాలని జితేందర్‌రెడ్డి కోరారు.
దేశంలోనే ప్రధాన ఏరోస్పేస్, రక్షణ రంగ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. నగరంలో డజనుకుపైగా ప్రధాన రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక డీఆర్‌డీవో ప్రయోగశాలలు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు 1,500కుపైగా ఏరోస్పేస్, రక్షణ రంగ ఎంఎస్‌ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఏరోస్పేస్, రక్షణ రంగ ఎగుమతులు 100 శాతం వృద్ధి నమోదు చేశాయని వివరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్–బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే ఈ రంగంలో మరింత పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రతిపాదిత కారిడార్ ద్వారా దేశీయ రక్షణ ఉత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని జితేందర్‌రెడ్డి అన్నారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు వేగవంతం కావడంతోపాటు మౌలిక సదుపాయాలు, సామర్థ్యాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. దేశ రక్షణ సన్నద్ధతను పెంచడంతోపాటు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని వివరించారు. జితేందర్‌రెడ్డి విజ్ఞప్తిపై రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనను తగిన విధంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు
ఆగస్టు 10, 2026

Minister Vakiti Srihari | 4.21 లక్షల మంది మత్స్యకారులకు రూ.5లక్షల ప్రమాద బీమా : మంత్రి వాకిటి శ్రీహరి
ఆగస్టు 10, 2026

Faria Abdullah | బోనాల వేడుకలో కంటతడి పెట్టిన జాతిరత్నాలు హీరోయిన్ – తెలంగాణ కల్చర్‌కు ఫిదా
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Maha Varuna Yagam | వరుణుడి కరుణ కోసం మహా యాగం.. సాగర్ తీరాన అంగరంగ వైభవంగా 'కరీరీ ఇష్టి'.. పూర్ణాహుతిలో సీఎం రేవంత్
- ●Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు
- ●Kiran Abbavaram | ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - పౌరాణిక సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి ఎంట్రీ!
- ●van swept away | నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి
- ●Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..
- ●Inflation | 1970ల నాటి ద్రవ్యోల్బణం మళ్లీ రానుందా.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా..?

Maha Varuna Yagam | వరుణుడి కరుణ కోసం మహా యాగం.. సాగర్ తీరాన అంగరంగ వైభవంగా 'కరీరీ ఇష్టి'.. పూర్ణాహుతిలో సీఎం రేవంత్

Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు

Kiran Abbavaram | ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - పౌరాణిక సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి ఎంట్రీ!

van swept away | నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి



