Revanth Reddy | రేవంత్ రెడ్డి సభకు వెళ్లి బస్సు కిందపడి మహిళ మృతి
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు వెళ్లిన ఓ మహిళ బస్సు కింద పడి మృతిచెందారు.
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు వెళ్లిన ఓ మహిళ బస్సు కింద పడి మృతిచెందారు. హుస్నాబాద్ (Husnabad) మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళా గ్రూప్ లీడర్ సారవ్వ.. సిద్దిపేటలో (Siddipet) గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు వెళ్లారు. ఈ క్రమంలో బస్సు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సిద్దిపేట దవాఖానకు తరలించగా అప్పటికే ఆమె మృతిచెందారు. ఈ విషయం బయటకు పొక్కకుండా కాంగ్రెస్ (Congress) వర్గాలు దాచిపెడుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయకపోవడం గమనార్హం.
సిద్దిపేట సభలో ఇందిరమ్మ కుటుంబ బీమా (Indiramma Family Insurance) పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సిద్దిపేటలో అభివృద్ధి పనుల కోసం రూ.550 కోట్ల నిధులను ఈ ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇక్కడ కాంగ్రెస్‌కు ఉన్న గత వైభవాన్ని అందరం గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకమైన మదన్‌మోహన్‌ను అందరం స్మరించుకోవాలని తెలిపారు.
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!





