త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Burqa | బుర్ఖాలో యువ‌కుడు.. బ‌స్టాండ్‌లో మ‌హిళ ప‌క్క‌నే కూర్చుని..

Burqa | ఓ యువ‌కుడు ముస్లి మ‌హిళ మాదిరిగా బుర్ఖా (Burqa) ధ‌రించాడు. బ‌స్టాండ్‌లో (Bus Stand) ఓ ప్ర‌యాణికురాలి ప‌క్క‌నే కూర్చుకున్నాడు. ఇంత‌లో అత‌నికి ఫోన్ రావ‌డంతో తాను ఎక్క‌డున్నాడ‌నే విష‌యం మ‌ర్చిపోయాడో ఏమో.. మాట్లాడ‌టం మొద‌లుపెట్టాడు.

G

Telangana | Published On Feb 18, 2026, 12.28 pm IST

Burqa | బుర్ఖాలో యువ‌కుడు.. బ‌స్టాండ్‌లో మ‌హిళ ప‌క్క‌నే కూర్చుని..
Advertisement

Burqa | త్రినేత్ర‌.న్యూస్‌: ఓ యువ‌కుడు ముస్లి మ‌హిళ మాదిరిగా బుర్ఖా (Burqa) ధ‌రించాడు. బ‌స్టాండ్‌లో (Bus Stand) ఓ ప్ర‌యాణికురాలి ప‌క్క‌నే కూర్చుకున్నాడు. ఇంత‌లో అత‌నికి ఫోన్ రావ‌డంతో తాను ఎక్క‌డున్నాడ‌నే విష‌యం మ‌ర్చిపోయాడో ఏమో.. మాట్లాడ‌టం మొద‌లుపెట్టాడు. అప్ప‌టివ‌ర‌కు త‌నతోపాటు కూర్చున్న‌ది మ‌హిళే అనుకున్న ఆమె.. గొంతు విని అప్ర‌మ‌త్త‌మైంది. పురుషుడ‌ని తెలుసుకుని అవాక్కైన ఆమె.. వెళ్లి ఆర్టీసీ (RTC) సిబ్బందికి స‌మాచారం ఇచ్చింది. దీంతో వారు అత‌డిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా కోరుట్ల‌లో జ‌రిగింది.

గ‌త రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో బుర్ఖా వేసుకున్న ఓ యువ‌కుడు కోరుట్ల బ‌స్టాండ్‌కు (Korutla Bus stand) వ‌చ్చాడు. అక్క‌డ బ‌స్సు కోసం వేచిఉన్న ఓ మ‌హిళ ప‌క్క‌నే కూర్చుకున్నాడు. అయితే అత‌డు ఫోన్‌లో మాట్లాడుతుండ‌గా పురుషుడ‌ని నిర్ధారించుకున్న ఆమె.. ఆర్టీసీ సిబ్బంది స‌మాచారం ఇచ్చారు. దీంతో అక్క‌డికి చేరుకున్ని ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది అత‌నిడి అదుపులోకి తీసుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు.

కాగా, త‌న స్నేహితుడు వ‌స్తుండ‌టంతో బ‌స్టాండ్‌కు వ‌చ్చాన‌ని నిందితుడు తెలిపాడు. త‌న పేరు నొమాన్ అని, త‌న పేరు పైడిమ‌ల్లు అని చెప్పాడు.

https://x.com/TelanganaMaata/status/2023958942913835355/video/2

Advertisement
Advertisement