త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wife Murder | ప్రేమ పెళ్లి.. 9 నెల‌ల‌కే క‌ట్నం కోసం భార్య హ‌త్య‌

Wife Murder | వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ మూడు నెల‌ల పాటు వారి సంసార జీవితం సంతోషంగానే సాగింది. కానీ అంత‌లోనే భ‌ర్త‌లో ఓ క్రూర‌త్వం బ‌య‌ట‌ప‌డింది. క‌ట్నం తేవాల‌ని భార్య‌ను హింసించాడు.

S

Telangana | Published On Dec 19, 2025, 12.24 pm IST

Wife Murder | ప్రేమ పెళ్లి.. 9 నెల‌ల‌కే క‌ట్నం కోసం భార్య హ‌త్య‌
Advertisement

Wife Murder | వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ మూడు నెల‌ల పాటు వారి సంసార జీవితం సంతోషంగానే సాగింది. కానీ అంత‌లోనే భ‌ర్త‌లో ఓ క్రూర‌త్వం బ‌య‌ట‌ప‌డింది. క‌ట్నం తేవాల‌ని భార్య‌ను హింసించాడు. ఆమె క‌ట్నం తేక‌పోవ‌డంతో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ఏరియాకు చెందిన అనూష‌(20), ప‌ర‌మేశ్ గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామ‌ని వీరిద్ద‌రూ త‌మ కుటుంబ పెద్ద‌ల‌కు చెప్పారు. ఇరు కుటుంబాల అంగీకారం మేర‌కు ఈ ఏడాది మార్చి 12న పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యాక ఓ మూడు నెల‌ల పాటు అన్యోన్యంగా జీవించారు. ఆ త‌ర్వాత క‌ట్నం తేవాల‌ని అనూష‌ను ప‌ర‌మేశ్ వేధింపుల‌కు గురి చేశారు.

పుట్టింటికి వెళ్లి క‌ట్నం తీసుకురావ‌డం లేద‌ని ఆమెను మాన‌సికంగా, శారీర‌కంగా వేధించేవాడు. అంతేకాదు దూషించేవాడు. క‌ర్ర‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్ట‌డంతో అనూష అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనూష తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పరారీలో ఉన్న పరమేష్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement