త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Honesty of an auto driver | ఆప‌రేష‌న్ డ‌బ్బులు ఆటోలోనే మ‌రిచాడు.. గంట‌ల్లోనే బాధితుడికిచ్చేశారు

Honesty of an auto driver | ఆప‌రేష‌న్ కోసం తీసుకెళ్తున్న‌ డబ్బుల బ్యాగును ఆటోలో మ‌ర్చిపోగా గంట‌ల వ్య‌వ‌ధిలోనే బాధితుడికి అప్ప‌గించిన ఘ‌ట‌న రాంగోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. ఆటో డ్రైవ‌ర్‌ను గుర్తించి న‌గ‌దు ఉన్న బ్యాగును బాధితుడికి అంద‌జేశారు.

S

Hyderabad | Published On May 19, 2026, 3.04 pm IST

Honesty of an auto driver | ఆప‌రేష‌న్ డ‌బ్బులు ఆటోలోనే మ‌రిచాడు.. గంట‌ల్లోనే బాధితుడికిచ్చేశారు
Advertisement
  • ఆటోను ట్రేస్ చేసి గుర్తించిన రాంగోపాల్‌పేట పోలీసులు
  • 1.20 ల‌క్ష‌ల బ్యాగు బాధితుడికి అంద‌జేత‌
  • ఆటో డ్రైవ‌ర్ నిజాయితీని మెచ్చుకొని స‌త్కారం

Honesty of an auto driver | త్రినేత్ర‌.న్యూస్‌: ఆప‌రేష‌న్ కోసం తీసుకెళ్తున్న‌ డబ్బుల బ్యాగును ఆటోలో మ‌ర్చిపోగా గంట‌ల వ్య‌వ‌ధిలోనే బాధితుడికి అప్ప‌గించిన ఘ‌ట‌న రాంగోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. సాయి కుమార్ అనే బాధిత‌ వ్య‌క్తి స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా త‌క్ష‌ణ‌మే వారు స్పందించారు. ఆటో డ్రైవ‌ర్‌ను గుర్తించి న‌గ‌దు ఉన్న బ్యాగును బాధితుడికి అంద‌జేశారు.

రాంగోపాల్‌పేట‌ ఎస్‌హెచ్‌ఓ బి. సురేష్ కుమార్ ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ఈనెల 18న సాయి కుమార్ అనే వ్యక్తి రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో త‌న డ‌బ్బుల బ్యాగును ఆటోలో మ‌రిచిపోయిన‌ట్లు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి ఆపరేషన్ నిమిత్తం ఓ ఆటోలో కిమ్స్ (KIMS) ఆసుపత్రికి వచ్చాడు. కంగారులో చికిత్స కోసం ఉంచిన రూ. 1,20,000 నగదు ఉన్న తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. ఈ కేసును చేదించేందుకు క్రైమ్ స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ జి. సురేష్ (3419), కానిస్టేబుల్ ఎస్. ప్రమోద్ కుమార్ (2837), కానిస్టేబుల్ బి. నరసింహ (30569) లతో కూడిన ప్రత్యేక బృందాన్ని పంపించాం. సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించి, ఆటో నంబరును గుర్తించి, సదరు ఆటో డ్రైవర్‌ను విజయవంతంగా ట్రేస్ చేశారు. ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధితుడికి బ్యాగును అందించారు అని తెలిపారు.

కష్టసమయంలో అత్యంత వేగంగా స్పందించి, తన తండ్రి వైద్యానికి అవసరమైన నగదును తిరిగి ఇప్పించిన రాంగోపాల్‌పేట పోలీసులకు సాయి కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో డ్రైవర్ ప్రదర్శించిన నిజాయితీని అభినందిస్తూ బి.సురేష్ కుమార్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. కేసును వేగంగా ఛేదించిన క్రైమ్ బృందాన్ని ఎస్‌హెచ్‌ఓ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement