త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navanethem “Navi” Pillay | నవనీతం నవి పిళ్లై కు నోబెల్ శాంతి బహుమతి

Navanethem "Navi" Pillay | భారత సంతతికి చెందిన మహిళ నవనీతమ్ నవీ పెళ్లె (Navanethem "Navi" Pillay) కు నోబెల్ శాంతి (Nobel peace prize) పురస్కారం దక్కింది. 60 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో న్యాయ నిపుణురాలిగా.. అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో మానవ హక్కుల కోసం శ్రమించినందుకు ఆమెకు ఈ గౌరవం లభించింది

a

International | Published On Oct 9, 2026, 2.58 pm IST

Navanethem “Navi” Pillay | నవనీతం నవి పిళ్లై కు నోబెల్ శాంతి బహుమతి
Advertisement

Navanethem "Navi" Pillay | త్రినేత్ర న్యూస్ : దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగి అంతర్జాతీయ న్యాయ నిపుణురాలిగా ఎదిగిన భారత సంతతికి చెందిన మహిళ నవనీతమ్ నవీ పిళ్లె (Navanethem "Navi" Pillay) కు నోబెల్ శాంతి (Nobel peace prize) పురస్కారం దక్కింది. 60 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో న్యాయ నిపుణురాలిగా.. అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో మానవ హక్కుల కోసం శ్రమించినందుకు ఆమెకు ఈ గౌరవం లభించింది.86 ఏళ్ల వయసున్న నవనీతమ్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో పుట్టి పెరిగారు. అక్కడి నాటల్ విశ్వవిద్యాలంలో చదివి 1965లో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు. ఉన్నత చదువులు చదివిన ఆమె, ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ లా స్కూల్ నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ (SJD) సాధించిన తొలి దక్షిణాఫ్రికా వ్యక్తిగా నిలిచారు.

1890లోనే ఆ కుటుంబం దక్షిణాఫ్రికాకు

నవనీతం తాత తరం.. 1890లోనే దక్షిణాప్రికాలోని నాటల్ లో చక్కెర తోటల్లో పనిచేయడానికి ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లారు. నవనీతం తల్లిదండ్రులకు మొత్తం 8 మంది సంతానం. వారిలో ఐదవది నవనీతం. ఆమె తండ్రి నారైన్‌సామి వృత్తిరీత్యా బస్ డ్రైవర్ గా పనిచేసేవారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష (Apartheid) అమల్లో ఉన్న రోజుల్లో, నాటల్ (Natal) ప్రావిన్స్‌లో సొంతంగా లా ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి శ్వేతజాతీయేతర (Non-white) మహిళా లాయర్‌గా రికార్డు సృష్టించారు. ఆ సమయంలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన పలువురు రాజకీయ ఖైదీల తరపున ఆమె కోర్టులో వాదించారు. రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICTR) జడ్జిగా ఉన్నప్పుడు.. యుద్ధ సమయాల్లో మరియు అంతర్గత ఘర్షణల్లో జరిగే "లైంగిక దాడి (Rape)" ని కూడా జాతి నిర్మూలన (Genocide) నేరంగా పరిగణించాలనే చారిత్రాత్మక తీర్పును ఇవ్వడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) లో జడ్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.మహిళల హక్కుల కోసం, ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న వారి న్యాయం కోసం ఆమె చేసిన కృషికి గాను ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు (ఉదాహరణకు 2025 సిడ్నీ శాంతి బహుమతి) ఆమెను వరించాయి.

 

Advertisement
Advertisement