త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anjaiah Yadav | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వ‌లే: మాజీ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌

Anjaiah Yadav | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వ‌లేద‌ని మాజీ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్ ప్ర‌శ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక పాల‌మూరు, రంగారెడ్డిలో ఐదు రిజ‌ర్వాయ‌ర్లు పూర్తి చేశామ‌ని చెప్పారు.

S

Telangana | Published On May 21, 2026, 1.53 pm IST

Anjaiah Yadav | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వ‌లే: మాజీ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌
Advertisement

Anjaiah Yadav | త్రినేత్ర‌.న్యూస్: పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వ‌లేద‌ని మాజీ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్ ప్ర‌శ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక పాల‌మూరు, రంగారెడ్డిలో ఐదు రిజ‌ర్వాయ‌ర్లు పూర్తి చేశామ‌ని చెప్పారు. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉండి మమ్మల్ని తీసుకువెళ్లి పాలమూరు, రంగారెడ్డి పనులను చూయించారని గుర్తు చేశారు. గురువారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ సీఎం అయ్యాక సాగు నీటికి ప్రాధాన్యత ఇచ్చారు. పాలమూరు, రంగారెడ్డిలో ఐదు రిజర్వాయర్లు పూర్తి చేశాం. కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరును ఎండబెట్టారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వ‌కు ఇవ్వలేదు? అని అంజ‌య్య యాద‌వ్ ప్ర‌శ్నించారు.

పాల‌మూరుపై సీఎం రేవంత్‌కు వివ‌క్ష ఎందుకు? : మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు పూర్తి అయింది. రెండున్నరేళ్లలో పాలమూరు జిల్లా వాసి రేవంత్ రెడ్డి సీఎం అయినా పాలమూరు, రంగారెడ్డిని పూర్తి చేయలేదు. పాలమూరు రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి వివక్ష ఎందుకు? కొల్లాపూర్ నియోజకవర్గంలో సింగోటం లింక్ కెనాల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో లిఫ్ట్ లన్నీ పూర్తి చేయాలి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలి. మంత్రి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. త్వరలోనే పాదయాత్ర చేస్తాం.

Advertisement
Advertisement