Ramchandar Rao | విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే.. వారి గూంజ్ కాంగ్రెస్‌కు వినిపిస్తలేదు
Ramchandar Rao | కాంగ్రెస్ ప్రభుత్వం పాలటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఆయుష్ విద్యార్థులతో పాటు మిగతా విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే వారి గూంజ్ (ధ్వని) ఈ ప్రభుత్వానికి వినిపిస్తలేదన్నారు.
- గృహ నిర్బంధం చేసి నా గొంతును అణచలేరు
- అలా అనుకుంటే అది వారి భ్రమే అవుతుంది
- విద్యార్థులకు నైతికంగా మద్దతు ఇస్తాం
- మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం పాలటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఆయుష్ విద్యార్థులతో పాటు మిగతా విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే వారి గూంజ్ (గళం) ఈ ప్రభుత్వానికి వినిపిస్తలేదన్నారు. ప్రభుత్వం అహంకారపూరిత ధోరణితో విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. గురువారం రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన ఆయన్ను తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ నిర్బంధం చేయడం ద్వారా నా గొంతును అణచాలనుకుంటే అది కాంగ్రెస్ భ్రమే అవుతుందన్నారు.
విద్యాలోకం మొత్తంగా అంధకారంలోకి పోయింది. విద్యార్థులకు ఫీజులు ఇయ్యట్లేదు, ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్ రావట్లేదు. విద్యార్థులందరికీ అండగా మొన్న 2 రోజుల నిరాహర దీక్ష చేస్తే.. వేలాది మంది విద్యార్థుల వచ్చి తమ గొంతుకను వినిపించారు. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థుల పిలుపు మేరకు వారికి అండగా నిలుస్తూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో మేం పోరాడుతుంటే.. ప్రజావ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌తో మమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గం.
రాహుల్ గాంధీ తెలంగాణలోని విద్యార్థుల గొంతును (గూంజ్) పూర్తిగా విస్మరించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఆయుష్ (AYUSH) విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థులు రోడ్డెక్కారు. సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులు నిరసన దీక్షలు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం వారి ‘గూంజ్’ (ధ్వని) ఎప్పుడూ వినిపించలేదు. ఎందుకంటే విద్యార్థుల సంక్షేమం వారికి ఏనాడూ ప్రాధాన్యం కాదు.
మా గొంతును ఎవరూ మూయలేరు. మేము విద్యార్థుల వెన్నంటే నిలబడుతాం. ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఇస్తానని.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిధులు ప్రకటించి ఏడాది గడిచినా.. రూపాయి కూడా మంజూరు చేయలేదు. టీచర్లకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని స్వయంగా సీఎం అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దారిలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తోంది. విద్యార్థుల విషయంలో మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని చెప్తూనే ఉన్నాం.
పాలిటెక్నిక్ కోర్సు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవటం సరికాదు. మీ నిర్ణయం సరైనది అయితే.. మళ్లీ కమిటీ ఎందుకు వేశారు? బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.15వేల కోట్లకు చేరాయి. యంగ్ ఇండియా స్కూల్స్ అని గొప్పగా చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి.. భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.
నిరసనలను అణచివేయడం, ప్రతిపక్షాల గొంతును నొక్కడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అలవాటే. అయినప్పటికీ వీళ్లే మాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారు. తెలంగాణలో విద్యార్థులు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే. విద్యార్థులను రాజకీయంగా వాడుకునే కాన్సెప్ట్‌కు మేం వ్యతిరేకం. వారి ఉద్యమంలోకి మేం వెళ్లం. నైతికంగానే మద్దతు ఇస్తాం అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
- ●Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Aircraft Crashes | కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి
- ●Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
- ●Nepal Floods | ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం
- ●Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!

Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!

Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?

Aircraft Crashes | కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి

Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..







