త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepal Floods | నేపాల్‌లో వ‌ర‌దలు.. తెలంగాణ వాసుల‌కు హెల్ప్ లైన్ ఏర్పాటు

Nepal Floods | నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.

S

Telangana | Published On Aug 26, 2026, 10.30 pm IST

Nepal Floods | నేపాల్‌లో వ‌ర‌దలు.. తెలంగాణ వాసుల‌కు హెల్ప్ లైన్ ఏర్పాటు
Advertisement

Nepal Floods | త్రినేత్ర‌.న్యూస్ : నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA),ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం తో పాటు ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు లేదా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

సహాయక చర్యల సమన్వయాన్ని సులభతరం చేసేందుకు సంబంధిత వ్యక్తుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను హెల్ప్‌లైన్ అధికారులకు అందించాలి.

నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ అధికారులు అందుబాటులో ఉంటారు. హెల్ప్‌లైన్‌కు అందే విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందించేందుకు సమన్వయం చేస్తారు. నేపాల్‌లోని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన తదుపరి చర్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటుంది.

హెల్ప్‌లైన్ నంబర్లు:

వందన
పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్
9871999044

సీహెచ్ చక్రవర్తి
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
9949351270

జీ రక్షిత్ నాయక్
లైజన్ ఆఫీసర్
9618597969

Advertisement
Advertisement