త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghunandan Rao | పంచాయ‌తీ నిధులు నువ్వు తెచ్చేదేంది రేవంత్‌: ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు

Raghunandan Rao | మార్చి 31వ తేదీలోపు ఢిల్లీ నుంచి రూ. మూడు వేల కోట్లు తీసుకువ‌చ్చి ఇస్తాన‌ని సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ (BJP) ఎంపీ (MP) ర‌ఘునంద‌న్‌రావు (Raghunandan Rao) మండిప‌డ్డారు. పంచాయ‌తీ నిధులు నువ్వు తెచ్చేదేంది రేవంత్ అని ప్ర‌శ్నించారు. నిధులు ఎలా వ‌స్తాయో తెలియ‌దని.. అడ్మినిస్ట్రేష‌న్‌పై ప‌ట్టు లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. కేంద్ర‌ప్ర‌భుత్వం ప‌దిహేనవ ఆర్థిక సంఘం (15th Finance Commission) ద్వారా నేరుగా పంచాయ‌తీ అకౌంట్ల‌లోకి నిధులు జ‌మ‌చేస్తుంద‌ని చెప్పారు.

A

Telangana | Published On Dec 27, 2025, 7.07 pm IST

Raghunandan Rao | పంచాయ‌తీ నిధులు నువ్వు తెచ్చేదేంది రేవంత్‌: ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు
Advertisement

నేరుగా గ్రామాల అకౌంట్ల‌లోకి ఆర్థిక‌సంఘం ద్వారా నిధులు వ‌స్తాయ‌ని వెల్ల‌డి
రెండేళ్లుగా పంచాయ‌తీల‌ను భ్ర‌ష్టుప‌ట్టించార‌ని ధ్వ‌జం

Raghunandan Rao | ఇటీవల కొడంగ‌ల్‌లో జ‌రిగిన స‌ర్పంచ్‌ల అభినంద‌న స‌భ‌లో ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)మాట్లాడుతూ మార్చి 31వ తేదీలోపు ఢిల్లీ నుంచి రూ. మూడు వేల కోట్లు తీసుకువ‌చ్చి ఇస్తాన‌ని చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ (BJP) ఎంపీ (MP) ర‌ఘునంద‌న్‌రావు (Raghunandan Rao) మండిప‌డ్డారు. పంచాయ‌తీ నిధులు నువ్వు తెచ్చేదేంది రేవంత్ అని ప్ర‌శ్నించారు. నిధులు ఎలా వ‌స్తాయో తెలియ‌దని.. అడ్మినిస్ట్రేష‌న్‌పై ప‌ట్టు లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. కేంద్ర‌ప్ర‌భుత్వం ప‌దిహేనవ ఆర్థిక సంఘం (15th Finance Commission) ద్వారా నేరుగా పంచాయ‌తీ అకౌంట్ల‌లోకి నిధులు జ‌మ‌చేస్తుంద‌ని చెప్పారు. రెండేళ్లుగా పంచాయతీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా స్థానిక సంస్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టించార‌ని మండిప‌డ్డారు. గ్రామీణ భార‌తం బాగుండాలంటే స‌ర్పంచ్ ద్వారా మాత్ర‌మే నిధులు ఖ‌ర్చు చేయాల‌ని మ‌హాత్మాగాంధీ క‌ల‌లు క‌న్నారని గుర్తు చేశారు. రెండేళ్లుగా గ్రామాల‌ను ప‌ట్టించుకోకుండా, ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా, ఏం ప‌నులు చేయ‌కుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అటువంటి వాళ్లు ఇప్ప‌డు మ‌హాత్మాగాంధీ పేరుతో త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం బాధాక‌రమ‌న్నారు.

పంచాయ‌తీల‌కు కేంద్ర‌నిధులే ఆధారం

గ్రామ పంచాయ‌తీలు పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌తోనే ఆధార‌ప‌డి ఉంటాయ‌ని ర‌ఘునంద‌న్‌రావు అన్నారు. రెండేళ్లుగా పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో నిధులు నిలిచిపోయాయ‌ని చెప్పారు. అందుకే ఎన్నిక‌లు నిర్వ‌హించార‌న్నారు. ప‌దిహేన‌వ ఆర్థిక సంఘం ఒక్కొక్క‌రికి సంవ‌త్స‌రానికి 815 రూపాయ‌ల చొప్పున, జ‌నాభా ఆధారంగా ఆయా పంచాయతీల‌కు నిధులు ఇస్తుందని వివ‌రించారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంతో పాటు నిలిచిన రెండు సంవ‌త్స‌రాల‌తో క‌లిపి మొత్తం మూడు ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన నిధులు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ల‌లో జ‌మ అవుతాయని వివ‌రించారు. ఎవ‌రు అడిగినా అడ‌గ‌కున్నా అవి కేంద్ర‌ప్ర‌భుత్వం నేరుగా పంచాయతీల‌కు ఇస్తుందని, ఇందులో రాష్ట్ర‌ప్ర‌భుత్వ పాత్ర శూన్యమ‌ని అన్నారు. గ‌తంలో పంచాయ‌తీల‌ను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తే న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాని అయిన త‌రువాత పంచాయతీ అకౌంట్ల‌లోకి నేరుగా ఆర్థిక సంఘం నిధులు జ‌మ‌చేసే విధానాన్ని ప్రారంభించార‌ని పేర్కొన్నారు.

గ్రామీణ అవ‌స‌రాలు తీర్చేందుకు ఉపాధి హామీ ప‌థ‌కం

పంచాయ‌తీల‌కు ఉన్న ఇంకో అకౌంటు ఉపాధి హామీ ప‌థ‌కం అకౌంట‌ని చెప్పారు. దీనికింద ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్ర‌ప్ర‌భుత్వం రూ.1250 కోట్లు తెలంగాణ ప్ర‌భుత్వానికి విడుద‌ల చేసిందని అన్నారు. తొమ్మిది నెల‌ల్లో ఖ‌ర్చు చేసింది రూ.250 కోట్లు మాత్ర‌మేన‌ని, ఇంకా వెయ్యి కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయ‌తీ భ‌వ‌నం, అంగ‌న్‌వాడీ కేంద్రం భ‌వ‌నం, మ‌హిళా స‌మాఖ్య భ‌వ‌న్ం, ఆహార దినుసుల నిల్వ కోసం భ‌వ‌న నిర్మాణాలు చేసుకోవ‌చ్చని స‌ర్పంచ్‌ల‌కు సూచించారు. దీనికి అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు పంపించాలన్నారు. ఈ నిధులు సైతం కేంద్ర‌మే భ‌రిస్తుంద‌న్నారు. పంచాయ‌తీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చేది ఒక‌టేన‌ని, మ‌ల్టీప‌ర్ప‌స్ వ‌ర్క‌ర్‌ల వేత‌నాలు నెల‌కు రూ.9,500 చొప్పున చెల్లిస్తుంద‌ని వివ‌రించారు. అవి కూడా మూడు నెల‌లు, ఆరు నెల‌లకు ఒక‌సారి జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. మేజ‌ర్ పంచాయితీల‌లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ఉంటే ఆ వేత‌నం కూడా ఇస్తుంద‌ని చెప్పారు.

ఇచ్చేది మేము.. చెప్పుకునేది వారు..

నిధుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం ఇస్తుంటే చెప్పుకునేది మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మ‌ని ఎద్దేవా చేశారు. మీడియా ముఖంగా నిధులు తామే ఇస్తున్నామని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారని దుయ్య‌బ‌ట్టారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన శ్మ‌శాన వాటిక‌లు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నం వంటివి అన్నీ ఉపాధి హామీ ప‌థ‌కంలోని కేంద్ర‌ప్ర‌భుత్వ నిధుల‌తోనేన‌ని అన్నారు. గ్రామాల్లో అవ‌స‌ర‌మైన వారికి ప‌శువుల పాక‌లు, పౌల్ట్రీ ఫామ్‌లు, గొర్రెల పాక‌లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందని చెప్పారు.

శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి

గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కానికి గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నార‌ని మండిపడిన రేవంత్ పేరు మార్పుపై చ‌ర్చ జ‌రిపే బ‌దులు ప‌థ‌కంలో వ‌చ్చిన మార్పుల‌పై నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇవ్వాల‌ని హిత‌వు ప‌లికారు. ఖ‌ర్గేకు చిత్త‌శుద్ధి ఉంటే గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల‌ పేరుపై కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ప్రారంభించిన సంక్షేమ ప‌థ‌కాల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ పేరుతో కేవ‌లం రెండు, మూడు ప‌థ‌కాలు మాత్ర‌మే ప్రారంభించి, ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ విధానాలు భార‌తదేశానికి, హిందువుల‌కు వ్య‌తిరేకంగా ఉంటాయ‌ని మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement