త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather Update | భానుడి భ‌గ‌భ‌గ‌లు.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు

Weather Update | ఆదివారం కూడా రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడ‌తాయ‌ని హైద‌రాబాద్ వాత‌వార‌ణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ల్లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని చెప్పింది. చాలా జిల్లాల్లో 44 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

G

Telangana | Published On May 3, 2026, 8.24 am IST

Weather Update | భానుడి భ‌గ‌భ‌గ‌లు.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు
Advertisement

Weather Update | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు (Weather Update) న‌మోద‌వుతున్నాయి. 12 జిల్లాల్లో 45 డిగ్రీల‌కుపైగా (High Temperature) రికార్డ‌య్యాయి. ఈ సీజ‌న్‌లోనే అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు శ‌నివారం న‌మోద‌య్యాయి. నిజామాబాద్ జిల్లా మొండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. న‌ల్ల‌గొండ‌, నిర్మ‌ల్‌, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో 45.8 డిగ్రీలు రికార్డ‌యింది. ఇక కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 45.7 డిగ్రీలు, జ‌గిత్యాల జిల్లాలో 45.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 45.1 డిగ్రీలు న‌మోద‌వ‌గా, మిగిలిన జిల్లాల్లో 42.6 నుంచి 44.6 డిగ్రీల మ‌ధ్య న‌మోద‌యింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆదివారం కూడా రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడ‌తాయ‌ని హైద‌రాబాద్ వాత‌వార‌ణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ల్లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని చెప్పింది. చాలా జిల్లాల్లో 44 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కొత్త‌గూడెం, హైద‌రాబాద్‌, జ‌న‌గామ‌, భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్‌, మేడ్చ‌ల్‌, ములుగు, సిద్దిపేట‌, యాదాద్రి జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మ‌ధ్య‌, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మ‌ధ్య న‌మోద‌వుతాయ‌ని వెల్ల‌డించింది. ఈ నెల 6వ తేదీ అనంతరం ఉష్ణోగ్ర‌త‌లు 2 నుంచి 4 డిగ్రీల వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని, దీంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. మ‌ధ్యాహ్నం బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండ‌ట‌మే మంచిద‌ని పేర్కొంది.

మ‌రోవైపు దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ‌ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు ప‌డుతాయ‌ని వెల్ల‌డించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద‌ప‌ల్లి, భూపాలప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమ‌కొండ‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ క‌ర్నూల్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షం కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది.

 

Advertisement
Advertisement