Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్కుమార్ గౌడ్
Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలతో మాట్లాడతామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వీలైనంత తొందరగా నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని.. అయితే దసరాలోపు కాకపోవచ్చన్నారు.
Maheshkumar Goud | త్రినేత్ర న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలతో మాట్లాడతామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వీలైనంత తొందరగా నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని.. అయితే దసరాలోపు కాకపోవచ్చన్నారు. హైదరాబాద్ లో త్వరలోనే భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రొఫషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీతో కలిసి శనివారం గాంధీ భవన్లో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎప్పుడెప్పుడు బీజేపీ విపత్కర పరిస్థితి ఏదుర్కొన్నప్పుడు.. విదేశీ అనే అంశాన్ని తెరపైకి తెస్తుంది. ఇది దుర్మార్గపు చర్య. బీజేపీకి అలవాటుగా మారింది. 13 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క సామాన్యుడికి మేలు జరగలేదు. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినా బీజేపీ మాట్లాడడం లేదు. లౌకిక వాదుల ఓట్లు తొలగించారు. ఒక్క తెలంగాణలోనే 27 శాతం ఓట్లు తొలగించారు. ఇందులో ముస్లింలు, పేదవారు, ఆదివాసీల ఓట్లే అధికం. ఇదే విషయం ముషీరాబాద్ లో జరిగిందిం. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది.
రమేశ్ చెన్నితాల మాటలు మిస్కోట్ చేశారు..
కేరళలో రమేష్ చెన్నితాల తాము సర్ వల్లే గెలిచామని అనలేదు. ఆయన మాటలు మిస్ కోట్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ నీరుగారుస్తుంది. ఈడీలో దాదాపు 97 శాతం కేసులు ప్రతిపక్షాలకు చెందిన పారిశ్రామికవేత్తలపై నమోదయ్యాయి. సీఈసీ నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం కొలీజియంనే మార్చారు. మహారాష్ట్రలో 3 నెలల వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు ఎలా మారుతాయి? వెస్ట్ బెంగాల్, బీహార్ లో కూడా అదే జరిగింది. మోదీ, అమిత్ షాలకు శాశ్వతంగా అధికారంలో ఉండాలనే ఆలోచన ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వ్యవహరిస్తున్నారు అని మహేశ్ కుమార్ విమర్శించారు.
తాజావార్తలు
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్రెడ్డి
- ●Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
- ●Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ
- ●Land Survey | మూడు దశల్లో సమగ్ర భూసర్వే.. ఆధార్ తరహాలో భూదార్ కార్డులు
- ●Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్రెడ్డి

Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్

Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ





