త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | తెలంగాణ సంపద కాపాడటానికి ఎంతకైనా తెగిస్తం

Manne Krishank | తాము వ్య‌క్తిగ‌త ఆస్తులపై మాట్లాడ్డం లేద‌ని.. తెలంగాణ సంప‌ద గురించే మాట్లాడుత‌న్నామ‌ని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మ‌న్‌ మ‌న్నె క్రిశాంక్ అన్నారు.

S

Telangana | Published On Oct 9, 2026, 1.59 pm IST

Manne Krishank | తెలంగాణ సంపద కాపాడటానికి ఎంతకైనా తెగిస్తం
Advertisement
  • రేవంత్ అక్ర‌మ ఆస్తుల‌పై ఎన్ని ప్ర‌శ్న‌ల‌డిగినా ఆన్స‌రే లేదు
  • 817 ఎకరాలు ఎలా తాకట్టు పెడతారు?
  • కేటీఆర్ వెంట్రుక‌లు లెక్క‌పెట్ట‌నీకేనా వంశీకృష్ణ‌కు ఓట్లేసింది
  • కార్పొరేషన్ మాజీ చైర్మ‌న్‌ మ‌న్నె క్రిశాంక్ ధ్వ‌జం

Manne Krishank | త్రినేత్ర న్యూస్‌: తాము వ్య‌క్తిగ‌త ఆస్తులపై మాట్లాడ్డం లేద‌ని.. తెలంగాణ సంప‌ద గురించే మాట్లాడుత‌న్నామ‌ని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మ‌న్‌ మ‌న్నె క్రిశాంక్ అన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఆయ‌న అనుచ‌రుల అక్ర‌మ ఆస్తుల‌పై ఎన్ని ప్ర‌శ్న‌ల‌డిగినా ఆన్స‌రే లేద‌ని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వెంట్రుక‌లు లెక్క‌బెట్ట‌డానికేనా ఎంపీ వంశీకృష్ణ‌ (Vamshi Krishna)కు ఓట్లేసింది అని ఫైర‌య్యారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రేవంత్ స‌ర్కార్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ సంప‌ద కాపాడ్డానికి ఎంత‌కైనా తెగిస్తామ‌న్నారు.

ముఖ్యమంత్రి అందరి మీద బురద జల్లుతారు. కానీ ఆయనపై ఆరోపణలు వస్తే మాత్రం కనీసం సమాధానం లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని ప్రజలు ఆశిస్తే.. వీళ్లు మాత్రం డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. నేను ఇవాళ మీడియా సమావేశం పెడుతోంటే.. కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం నాపై ఏదేదో పెడుతున్నారు, అయినా భయపడేది లేదు.

హెచ్‌సీయూ విద్యార్థులు వీరోచితంగా పోరాడి కంచె 400 ఎకరాల గచ్చిబౌలి భూములను కాపాడుకున్నారు. కేటీఆర్ పోరాటంతో నాడు సుప్రీంకోర్టు కూడా రేవంత్ విధానాలను తప్పు బట్టింది. అప్పుడు మెత్తబడ్డ రేవంత్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా తన క్రిమినల్ బ్రెయిన్ తో హైదరాబాద్ నగరం మధ్యలోని 817 ఎకరాల భూములను తాకట్టు పెట్టి 12,818 వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. హైటెక్ సిటీ పక్కన ఇజ్జత్ నగర్, మొకిల, మియాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పఠాన్ చెరు, గాజులరామారం, జవహర్ నగర్ ప్రాంతాల్లోని భూములను తాకట్టు పెట్టారు.

బీకన్ ట్రస్ట్‌ను మధ్యవర్తిగా పెట్టి రుణం తీసుకొచ్చిండు..

రుణం కోసం మార్కెట్ విలువ కేవలం ఎకరాకు 15 కోట్లుగా చూపారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ 150 కోట్లకు పైనే ఉంటుంది. 2026, మార్చ్ 31 వరకు హెచ్ఎండీఏ ఖాతాలో 275 కోట్లు ఉంటే.. జూన్ నెలాఖరు వరకు 10 వేల కోట్లు డిపాజిట్ అయ్యాయి. కనీసం 40 నుంచి 80 వేల కోట్లు ఉండాల్సిన భూముల విలువ 12 వేల కోట్లు మాత్రమే చూపారు. ముంబయికి చెందిన బీకన్ ట్రస్ట్‌ను మధ్యవర్తిగా పెట్టి రుణం తీసుకొచ్చారు.

జవహర్ నగర్ లో తాకట్టు పెట్టిన భూమిని 2008లో జెన్ పాక్ట్ సంస్థకు కేటాయించారు. ఇవాళ ఆ భూమిలో కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా కంటెయినర్లు పెడుతున్నారు. ఓ వైపు తాకట్టు పెట్టిన భూమిలోనే కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా మనుషులు కంటెయినర్లు ఎలా పెడతారు? మేం వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడడం లేదు. తెలంగాణ సంపద గురించి మాట్లాడుతున్నాం. 817 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా ఎలా తాకట్టు పెడతారు.. ఆ భూముల విలువను ఎలా తగ్గించారు?

52 వేల కోట్ల అక్రమ ఆస్తుల‌ను ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టాం..

రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఖండిస్తున్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్రమ దందాలు, అరెస్టులు తప్ప ఇంకేమీ లేదు. ప్రశ్నలు అడిగితే దుర్మార్గంగా దాడి ఎలా చేస్తారు? దోపిడీ, అవినీతి గురించి ఎన్నిసార్లు, ఎంత మంది అడిగినా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? సమాధానం చెప్పకపోగా ఎదురు దాడి చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. మొన్నటి ఎపిసోడ్ లో రేవంత్ కుటుంబసభ్యులు 52 వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆధారాలతో చెప్పాం. ఈరోజు కేఎల్ఎస్ఆర్ ఎపిసోడ్ లో ఆ ఆస్తులు మరింత పెరిగాయ్. అనుముల ఫ్యామిలీ అనకొండ ఫ్యామిలీగా మారింది.

ఆయ‌న‌కు అందుకే ఓట్లేశారేమో..

కేటీఆర్, హరీష్ రావులు ఓటమి ఎరుగని నేతలు. తమపై వస్తున్న ఆరోపణలకు వాళ్ళే వివరణ ఇస్తున్నప్పుడు ఏ స్థాయి లేని రేవంత్ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదు. కేటీఆర్ జుట్టుకు ఏదో చేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ వెంట్రుకలు లెక్కబెట్టడానికా పెద్దపల్లి ప్రజలు ఆయనకు ఓట్లు వేసింది? నా ఆరోపణలకు సమాధానం లేకే కొందరు భౌతిక దాడులు చేస్తామంటున్నారు. వాళ్ళది క్రిమినల్ మనస్తత్వం.. ఏమైనా చేయొచ్చు. అయినా తెలంగాణ సంపద కాపాడటానికి ఎంతకైనా తెగిస్తాం అని క్రిశాంక్ తేల్చి చెప్పారు.

ఆ కారులోనే తిరిగేవాడు..

నెల్లూరుకు చెందిన KLSR ఇన్ఫ్రా సంస్థకు రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు అప్పజెప్తూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు KLSR ఇన్ఫ్రా సంస్థ గిఫ్ట్‌గా ఇచ్చిన కారులోనే తిరిగేవాడు. ఆ సంస్థ రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, విచారణ చేస్తున్నామని ఈడీ చెప్పింది. అన్ని కాంట్రాక్టులు అదే సంస్థకు ఎందుకు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి 818 ఎకరాలు తాకట్టు పెట్టిన దాంట్లో ఒక స్థలం.. జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లో ఉన్న భూమిని 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జెన్‌పాక్ట్ అనే ఐటీ కంపెనీకి ఎకరానికి రూ.28 లక్షల చొప్పున ఇచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR వాళ్లు ఈ జెన్‌పాక్ట్ స్థలాన్ని కబ్జా చేశారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.5 వేల కోట్లు. ఈ 50 ఎకరాల భూమిని KLSR వాళ్లకు ఎలా ఇచ్చారు? ఎవరు అనుమతి ఇచ్చారు?

Advertisement
Advertisement