Mallu Ravi | కుల వివక్షకు వ్యతిరేకంగా.. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతాం: మల్లు రవి
Mallu Ravi | దేశంలో కుల వివక్ష, మనువాదానికి వ్యతిరేకంగా.. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ అనుసరిస్తున్న మనువాద వైఖరిని ఖండించారు.
Mallu Ravi | త్రినేత్ర.న్యూస్: దేశంలో కుల వివక్ష, మనువాదానికి వ్యతిరేకంగా.. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ అనుసరిస్తున్న మనువాద వైఖరిని ఖండించారు. బీజేపీ పాలనలో కొనసాగుతున్న కుల వివక్ష, మనువాద వైఖరికి వ్యతిరేకంగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి మాట్లాడుతూ బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలి..
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా.. దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతుండడం దారుణమన్నారు. బీజేపీ పాలనలో సామాజిక న్యాయానికి జరుగుతున్న అన్యాయానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని చెప్పారు. కానీ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన వివక్షను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ తన మనువాద ఆలోచనా విధానాన్ని విడనాడి రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●కల్యాణ లక్ష్మిపై వెనక్కి తగ్గేది లేదు
- ●Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి
- ●E20 Petrol | పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎకనామిస్ట్ నాగేశ్వరన్
- ●Bigg Boss | హీరోగా తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ - డైరెక్టర్‌గా ప్రభాస్ ఈశ్వర్ యాక్టర్ - "సాV3" టీజర్ రిలీజ్
- ●Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి
- ●Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్

కల్యాణ లక్ష్మిపై వెనక్కి తగ్గేది లేదు

Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి

E20 Petrol | పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎకనామిస్ట్ నాగేశ్వరన్

Bigg Boss | హీరోగా తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ - డైరెక్టర్‌గా ప్రభాస్ ఈశ్వర్ యాక్టర్ - "సాV3" టీజర్ రిలీజ్




