త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి

Dasoju Sravan | సీఎం రేవంత్‌రెడ్డి సైకోలా మారిపోయాడ‌ని.. మీనాక్షి న‌ట‌రాజ‌న్ స్పందించి రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్ష‌ణకు పంపించాల‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ సూచించారు. ఎవ‌రెవ‌రికో అక్క‌డ ట్రైనింగ్ ఇస్తున్నార‌ని.. రేవంత్ లాంటి వ్య‌క్తిని వ‌దిలిపెట్ట‌డం క‌రెక్టు కాద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

S

Telangana | Published On Aug 17, 2026, 3.01 pm IST

Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి
Advertisement
  • ఆయ‌న సైకోలా మారిపోయాడు.. రేవంత్‌ను త‌న‌ భాషే భస్మం చేస్తుంది
  • రేవంత్‌ది సోష‌ల్ జ‌స్టిస్ కాదు.. అనుముల జ‌స్టిస్‌
  • చేవెళ్ల, షాబాద్ ప్రాంతాల్లో భూముల మీద వాలుతున్న‌రు
  • ముత్యాల ముగ్గు మూవీలో రావుగోపాల్‌రావు లాంటోడు రేవంత్‌రెడ్డి
  • స‌న్న వ‌డ్ల‌కే బోన‌స్ ఇస్తామ‌ని చెప్పి ఉంటే నేను గుండు గీసుకుంటా
  • మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ చెడుగుడు

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి సైకోలా మారిపోయాడ‌ని.. మీనాక్షి న‌ట‌రాజ‌న్ స్పందించి రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్ష‌ణకు పంపించాల‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ సూచించారు. ఎవ‌రెవ‌రికో అక్క‌డ ట్రైనింగ్ ఇస్తున్నార‌ని.. రేవంత్ లాంటి వ్య‌క్తిని వ‌దిలిపెట్ట‌డం క‌రెక్టు కాద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త‌న‌ది సోష‌ల్ జ‌స్టిస్ అని మాట్లాడుతున్నారని.. రేవంత్‌ది అనుముల జ‌స్టిస్ అని విమ‌ర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కేవలం స‌న్న వ‌డ్ల‌కే బోన‌స్ ఇస్తామ‌ని చెప్పి ఉంటే నేనే గుండు గీసుకుంటాన‌న్నారు. లేదంటే రేవంత్ గుండు గీసుకుంటారా? అని స‌వాల్ విసిరారు. నిన్న‌ ములుగు, పరకాలలో ముఖ్యమంత్రి బూతుల పరంపర కొనసాగించారని ఎద్దేవా చేశారు. ఈమేర‌కు సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో దాసోజు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ను చెడుగుడు ఆడుకున్నారు.

ముత్యాల ముగ్గు రావుగోపాలరావు పాలన..

‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు రాత్రి హత్య చేయించి పగలు శవానికి పూలదండలు వేసినట్లు.. రేవంత్ రెడ్డి పూలే విగ్రహాలు పెడుతూ మరోవైపు పూలే ఆశయమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బంద్ చేసి బీసీ విద్యార్థులను రోడ్డున పడేశారు. 42 శాతం రిజర్వేషన్లు, రూ. 20 వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్‌ హామీలను రేవంత్ ప్రభుత్వం డస్ట్‌బిన్‌లో పడేసింది. రేవంత్ రెడ్డికి సోషల్ జస్టిస్‌కు అర్థం తెలుసా? రేవంత్ రెడ్డిది సోషల్ జస్టిస్ కాదు.. అనుముల జస్టిస్. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎందుకు.. దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావును ఎదుర్కో.

అరగుండు సవాల్..

రేవంత్ ఒక సైకోపాత్, హ్యాబిచువల్ అఫెండర్.. గాంధీ పెట్టిన పార్టీకి ముఖ్యమంత్రివా లేక గల్లీ రౌడీవా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై అహంకారపు కూతలా? సన్న వడ్లకే రూ.500 బోనస్ అని మేనిఫెస్టోలో ఉంటే అరగుండుతో తిరుగుతా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించు! దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబరాల్లో ఉంటే, "కుక్క తోకకు గుండ్రాయి కట్టినా చక్కబడదు" అన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డి ములుగు, పరకాల సభల్లో సంస్కారహీనమైన బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు.

18 గంటల పని జోక్ ఆఫ్ ది ఇయర్..

నరేంద్ర మోదీని కాపీ కొడుతూ ‘రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా’ అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద హాస్యాస్పదమైన అబద్ధం. 18 గంటలు పనిచేసి రైతుబంధు ఇచ్చావా? రైతుబీమా ఇచ్చావా? రుణమాఫీ పూర్తి చేశావా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? మహిళలకు రూ. 2,500 మహాలక్ష్మి, తులం బంగారం, రూ. 4,000 పెన్షన్లు ఇచ్చావా? 18 గంటలు పనిచేసి ఎక్సైజ్, రియల్ ఎస్టేట్ రంగాలను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టావు. 18 గంటల్లో నువ్వు చేసిందల్లా సీఎం కుర్చీ కాపాడుకోవడానికి 78 సార్లు ఢిల్లీకి తెలంగాణ ప్రజల సంపదను ఈఎంఐల రూపంలో మూటలు మోయడమే.

రేవంత్‌ది కంచు బుద్ధి..

వేమన శతక పద్యమైన ‘అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను.. సజ్జనుండు బలుకు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా’ గుర్తు చేస్తూ రేవంత్ వైఖరిని చీల్చి చెండాడారు. "అల్పబుద్ధి కలవాడే డాంబికాలు పలుకుతాడు, శాంతస్వభావుడైన సజ్జనుడు హుందాగా ఉంటాడు. కంచులా గంతులు వేస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు అల్పుడివా? సజ్జనుడివా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పు" అని నిలదీశారు. గాంధీ పెట్టిన పార్టీకి ముఖ్యమంత్రివేనా రేవంత్ రెడ్డి? వీధి రౌడీలా మాట్లాడటం రాజకీయమా. తెలంగాణ గాంధీ కేసీఆర్ తన వెంట్రుక పీకలేడని రేవంత్ రెడ్డి మాట్లాడతాడా? తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని రేవంత్ రెడ్డి మసి అయిపోతాడు. రేవంత్ రెడ్డి భాషే రేవంత్‌ను భస్మం చేస్తుంది. రేవంత్ రెడ్డిని తన భాషే భస్మం చేస్తుంది. 18 గంటలు పని చేసి రాష్ట్రానికి ఏం చేశావు? 78 సార్లు డిల్లీకి మూటలు మోసావు.

మీ మ‌నవ‌డికి గ‌ల్లీ భాష‌నే నేర్పిస్త‌వా?

1972 నాటి పవిత్ర బంధం సినిమాలోని ‘గాంధీ పుట్టిన దేశమా ఇది.. నైతికత కోరిన సంఘమా ఇది’ పాటను రేవంత్ వినాలన్నారు. గాంధీ, నెహ్రూల సిద్ధాంతాల పునాదులపై నడిచే పార్టీకి సీఎంగా ఉంటూ వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా ‘పీకుతావా.. వెంట్రుక పీకలేరు.. తొండల భాష, పీకుడు భాష’ మాట్లాడటం ప్రజాపాలనా? మీ ఇంట్లోని మనవడికి, భవిష్యత్ తరాలకు ఈ గల్లీ భాషనే నేర్పిస్తారా?" అని ప్రశ్నించారు.

మోసగాళ్లకే మోసగాడు..

రేవంత్ రెడ్డి సాధించింది అనుముల కుటుంబం దోపిడి. మోసగాళ్లకు మోసగాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లాంటి కేటుగాడు మరొకరు లేరు. కోర్టుల్లో కేసులు వేయించి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలను ఆపేశారు. పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణను బొక్కా బోర్లా పడేశారు. చేవెళ్ల, షాబాద్ ప్రాంతాల్లో గద్దల లెక్క వాలి భూములను దోచుకుంటున్నారు. మ్యానిఫెస్టోలో సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని పెట్టలేదు..అలా పెట్టామని చెబితే అరగుండుతో తిరుగుతా.

నా గొంతు కోసి కోదండ‌రాంను ఎమ్మెల్సీ చేశాడు..

ముఖ్యమంత్రి తన అనుచరుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాడు. వీ హనుమంతరావుకు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి డబ్బు సంచులు దొబ్బి ఎవరెవరి గొంతు కోశాడో నాకు తెలుసు. నా గొంతు కోసి కోదండరాంను ఎమ్మెల్సీ చేశాడు. కోదండ రామ్‌ను శిఖండిలా పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నాడు.

మహేష్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా చేశాననటం దొరరికం. ఫ్యూడల్ మనస్తత్వం. రేవంత్ రెడ్డి.. నీ ఆస్తులపై చర్చకు రావాలి. త్వరలోనే కాందీశీకుల భూములపై పడతారు. అందరి ఇళ్లలో పంచాయతీలు ఉంటాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అందరి ఇళ్లలో తొంగి చూస్తున్నావా.. తిరుపతి రెడ్డి బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి కుటుంబం ఎందుకు వెళ్లలేదు. రాహుల్, మీనాక్షి జోక్యం చేసుకుని రేవంత్ తీరును మారిస్తే మంచిది. లేదంటే కాంగ్రెస్‌కు సమాధి తప్పదు. మహారాష్ట్రలోని నందిగ్రామ్ ఆశ్రమానికి పంపించి గాంధేయవాదం, ప్రజాస్వామ్య విలువలపై శిక్షణ ఇప్పించండి. అక్కడ పళ్లాలు కడిగి, టాయిలెట్లు శుభ్రం చేస్తేనైనా ఆయన అహంకారం తగ్గి బుద్ధి వస్తుందేమో. రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ బూతు రాజకీయాలు, అవినీతి దోపిడీని ఇప్పుడే అడ్డుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం" అని హెచ్చరించారు.

తిరుపతి రెడ్డి బర్త్ డే ఫ్లెక్సీలు ఎందుకు తీసి వేయించావు. కేటీఆర్, హరీష్ రావు ఉద్యమకారులు. రేవంత్ ఎప్పటికైనా తెలంగాణ ద్రోహే. కేసీఆర్‌కు తెలంగాణ అంతా ఓకే కుటుంబం అని దాసోజు శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు.

ఈ మీడియా స‌మావేశంలో బొమ్మెర రామమూర్తి, గోసుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement