Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో అక్రమంగా కబ్జాకు గురైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
- మీడియా చిట్‌చాట్‌లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: సిద్దిపేటలో అక్రమంగా కబ్జాకు గురైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ కొడుకు పేరు మీద ఉన్న 40 ఎకరాల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా చిట్ చాట్ సందర్భంగా మాట్లాడారు.
సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 327 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు తన పరపతిని ఉపయోగించి తన బంధువుల పేరిట 6 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారు. రంగనాయక సాగర్ వద్ద, ఇతర ప్రాంతాల్లో వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా దక్కించుకున్నారు. హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు రంగనాయక సాగర్ దగ్గర భూ దోపిడీ చేశారు. ప్రభుత్వం ఎకరాకు ఆరు లక్షల పరిహారం ఇస్తుంటే రూ.రెండు లక్షలకు ఎకరం చొప్పున భూమి ఎలా కొన్నాడు? ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ల్యాండ్‌ను డిలీట్ చేయించి 13 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ సొమ్ముతో హరీశ్ రావు తన ఫామ్‌హౌస్‌ను అభివృద్ధి చేసుకున్నారు.
కేటీఆర్ కొడుక్కి 40 ఎకరాల భూమి ఎక్కడిది?
నూనూగు మీసాల కేటీఆర్ కొడుకుకి 40 ఎకరాల భూమి ఎలా వచ్చింది? అసైన్డ్ భూముల పట్టాదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టం. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూములపై సర్వే అనంతరం వాస్తవాలు వెల్లడిస్తాం. రంగనాయకసాగర్ భూముల వ్యవహారంపైనా రికార్డుల ఆధారంగా విచారణ జరిపిస్తాం. తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అధికారుల పొరపాట్లకు కూడా మినహాయింపు లేదు. కేటీఆర్ చెప్పినట్లుగా కేసీఆర్‌కు చిన్నప్పుడే 2 ఎకరాల్లో ఇల్లుంటే ఎందుకు 2004 అఫిడవిట్‌లో చేర్చలేదు? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
సెప్టెంబర్ 18, 2026

ACB Rides in Kotthagudem dist | మహిళా ఉద్యోగి నుంచి లంచం డిమాండ్.. ఏసీబీకి పట్టుబడిన ఇన్చార్జ్ హాస్టల్ వార్డెన్
సెప్టెంబర్ 18, 2026

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
- ●Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ
- ●iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..
- ●Danam Nagender | దానం నాగేందర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన హైకోర్టు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. సూచీల్లో మిశ్రమ స్పందన..
- ●Blast Near Mosque | మసీదులో భారీ పేలుడు.. 15 మంది మృతి

Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు

Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ

iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..

Danam Nagender | దానం నాగేందర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన హైకోర్టు



