Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
Minister Seethakka | ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని, అధికారులు జిల్లాల్లో పర్యటిస్తూ సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారని చెప్పారు.
- ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలపై ప్రజలకు అవగాహన
- 34 రిజర్వాయర్లను తాగునీటి కోసం వినియోగిస్తున్నాం
- శాసనసభలో మంత్రి సీతక్క
Minister Seethakka | ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని, అధికారులు జిల్లాల్లో పర్యటిస్తూ సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా నీటి, ఉపాధి సమస్యలు ఎదురవుతాయని మంత్రి తెలిపారు. తాగునీటి, సాగునీటి శాఖలు సమన్వయంతో పనిచేస్తూ తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 34 రిజర్వాయర్లను తాగునీటి కోసం వినియోగిస్తున్నామని, అన్ని జలాశయాల్లో నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ శాఖతో వారానికోసారి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.
గ్రామాలవారీగా యాక్షన్ ప్లాన్
‘ఒక్క సింగూరు లోనే నీటి లభ్యత తక్కువగా ఉంది. 75 రోజులకు సరిపడా తాగు నీల్లు ఉన్నాయి. అయినప్పటికి అలట్నరేట్ యాక్షన్ ప్లాన్ గ్రామాల వారిగా సిద్దం చేశాం’ అని సీతక్క తెలిపారు. నీటి నిల్వలు తక్కువగా ఉన్న రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ నీటిని వినియోగించుకునేందుకు మోటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాగునీటి కోసం కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలు తగ్గితే వ్యవసాయ పనులు తగ్గి కూలీలకు ఉపాధి తగ్గుతుందని, అందుకే పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 60 కుటుంబాలకు పని కల్పించే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల్లో 7.3 కోట్ల పని దినాలు కల్పించామని, 21 లక్షల కుటుంబాలకు, 31.5 లక్షల మంది కూలీలకు ఉపాధి లభించిందన్నారు. ఇప్పటివరకు రూ.2 వేల కోట్లకు పైగా వేతనాలను నేరుగా కూలీలకు చెల్లించామని వెల్లడించారు. ‘వీబీ జీ రాం జీ వల్ల రాష్ట్రం మీద 40శాతం భారం పడుతోంది. అందుకే గతంలో మాదిరిగా ఎల్ నీ నో కాలంలో కేంద్రం 90 శాతం నిధులు కేంద్రం చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.
ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టాలి
ఎల్‌నినో అంటే కేవలం ఎండలు పెరగడం కాదని సీతక్క అన్నారు. వర్షం పడినప్పుడు నీటిని వృథాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇందులో భాగంగా ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని.. ‘ఇంటింటికీ ఇంకుడు గుంత..ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి ఊరికి ఊట కుంట..’ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సోక్ పిట్లు, ఫామ్ పాండ్లు, పెర్కొలేషన్ ట్యాంకులు నిర్మిస్తున్నామని చెప్పారు. సభలో ‘జలసిరి’ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే 5 కోట్ల 91 లక్షల మొక్కలు నాటామని సీతక్క తెలిపారు. ‘ఎవరో తెచ్చిన కరువు కాదు.. కష్టం కాదు.. వేల కీలోమీటర్ల దూరంలో పసిపిక్ సముద్రంలో ఏర్పడ్డ పరిస్థితి. అందుకే ప్రజలంతా సమాయత్తం అయి కలసి కట్టుగా ఎల్‌నినోను ఎదుర్కొందాం’ అని పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
సెప్టెంబర్ 18, 2026

Danam Nagender | దానం నాగేందర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన హైకోర్టు
సెప్టెంబర్ 18, 2026

ACB Rides in Kotthagudem dist | మహిళా ఉద్యోగి నుంచి లంచం డిమాండ్.. ఏసీబీకి పట్టుబడిన ఇన్చార్జ్ హాస్టల్ వార్డెన్
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Kaushik Reddy | దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్‌రెడ్డి
- ●Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ
- ●Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
- ●iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..
- ●Danam Nagender | దానం నాగేందర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన హైకోర్టు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. సూచీల్లో మిశ్రమ స్పందన..

Kaushik Reddy | దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్‌రెడ్డి

Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ

Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం

iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..



