Danam Nagender | దానం నాగేందర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన హైకోర్టు
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై కోర్టు అనర్హత వేటు వేసింది. ఈ అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ.. ఆయనపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. అనంతరం 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరినట్లు పిటిషనర్లు పిటిషనర్లు ఆరోపించారు. అదే ఏడాది సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఫిరాయింపుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్.. దానం నాగేందర్ చట్టపరంగా పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు శుక్రవారం స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది.
మిగతా ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ
దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగతా ఎమ్మెల్యేల వ్యవహారంపైనా ఉత్కంఠ నెలకొంది. ఇదే తరహాలో పలువురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో.. తాజా తీర్పు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. దీంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా స్పీకర్ నిర్ణయాలపై హైకోర్టు జోక్యం చేసుకోవడం ఈ కేసులకు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే, దానం నాగేందర్ మాత్రం తాను బీఆర్‌ఎస్ నుంచి పార్టీ మారినట్లు వచ్చిన వార్తలను గతంలో తోసిపుచ్చారు. స్పీకర్ విచారణ సందర్భంగా తాను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదని, పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నానని ఆయన వాదించారు. అయితే, ఆయన వాదలన్నింటిని హైకోర్టు తిరస్కరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
- ●Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ
- ●Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
- ●iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. సూచీల్లో మిశ్రమ స్పందన..
- ●Blast Near Mosque | మసీదులో భారీ పేలుడు.. 15 మంది మృతి

Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు

Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ

Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం

iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..





