Ministers in Bonaalu Festival | ప్రజలందిరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.. ఆయురారోగ్యాలతో మెలగాలని ప్రార్థించాం
Ministers in Bonaalu Festival | రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలని మొక్కుకున్నట్లు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
- సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నామన్న మంత్రులు
- లాల్‌దర్వాజా సింహవాహిని, భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన, టీపీసీసీ చీఫ్, మంత్రులు
Ministers in Bonaalu Festival | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలని మొక్కుకున్నట్లు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు.


బోనాల పండుగ హైదరాబాద్‌కు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక పండుగ అని నేతలు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశ, విదేశాల్లోని హిందూ భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. అమ్మవారి దయతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు మంత్రులు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని, బోనాల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని నాయకులు ఆకాంక్షించారు. ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రజల ఐక్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. బోనాల సందర్భంగా నగర ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆలయాలకు చేరుకున్న మంత్రులకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.

ఆషాఢ మాస బోనాల సందర్భంగా హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి శ్రీధర్‌బాబు అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పూజలు చేశారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా
ఆగస్టు 9, 2026

KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు
ఆగస్టు 9, 2026

Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్ జల ఉద్యమం చేయాల్సిన పని లేదు.. ప్రజలే నీకు జల సమాధి కడతరు
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Bigg Boss | బిగ్‌బాస్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు - సీరియల్ నుంచి ఔట్ - రూమర్లపై క్లారిటీ వచ్చేసింది!
- ●Trisha | అన్నతో విభేదాలు - తమ్ముడితో సినిమా - త్రిష నిర్ణయాలు ఊహాతీతం
- ●Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా
- ●SBI Clerk Recruitment | 1538 పోస్టులతో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?
- ●Vijay Devarakonda | లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
- ●KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు

Bigg Boss | బిగ్‌బాస్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు - సీరియల్ నుంచి ఔట్ - రూమర్లపై క్లారిటీ వచ్చేసింది!

Trisha | అన్నతో విభేదాలు - తమ్ముడితో సినిమా - త్రిష నిర్ణయాలు ఊహాతీతం

Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా

SBI Clerk Recruitment | 1538 పోస్టులతో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?



