త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gutta Sukhendar Reddy | వాన‌లు స‌మృద్ధిగా ప‌డాల‌ని.. ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని మ‌హంకాళి అమ్మ‌వారిని కోరుకున్నా

Gutta Sukhendar Reddy | రాష్ట్రంలో వాన‌లు స‌మృద్ధిగా కుర‌వాల‌ని, పంట‌లు పుష్క‌లంగా పండి ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడ మ‌హంకాళి అమ్మ‌వారిని కోరుకున్న‌ట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి నూతన పట్టువస్త్రాలు అధికారికంగా సమర్పించారు.

S

Telangana | Published On Aug 9, 2026, 1.51 pm IST

Gutta Sukhendar Reddy | వాన‌లు స‌మృద్ధిగా ప‌డాల‌ని.. ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని మ‌హంకాళి అమ్మ‌వారిని కోరుకున్నా
Advertisement
  • రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించాం
  • శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutta Sukhendar Reddy | త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్రంలో వాన‌లు స‌మృద్ధిగా కుర‌వాల‌ని, పంట‌లు పుష్క‌లంగా పండి ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడ మ‌హంకాళి అమ్మ‌వారిని కోరుకున్న‌ట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి నూతన పట్టువస్త్రాలు అధికారికంగా సమర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆలయ కమిటీ, అర్చకులు ఆయ‌న‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గుత్తా మాట్లాడారు.

 

ఉప్పుగూడ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. గత సంవత్సరం కూడా ఉప్పుగూడ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి వానలు సంవృద్దిగా పడాలని, ప్రజలను సుభిక్షంగా ఉండేలా చూడాలని వేడుకున్న‌ట్లు గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా వానలు సంవృద్దిగా పడాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికి దక్కలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ అలంపల్లి నర్సింహా, ఆలయ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement