Vijay Devarakonda | లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda | హైదరాబాద్‌లో బోనాల (Bonalu)పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Vijay Devarakonda | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో బోనాల (Bonalu)పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు సినీ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతోపాటు (Vijay Devarakonda) ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. లాల్ దర్వాజా అమ్మవారిని (Lal Darwaja) దర్శించుకున్నారు. సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ముగ్గురూ కలిసి ఆలయానికి రావడంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. దర్శనం అనంతరం బయటకు వచ్చిన విజయ్‌ను ఫోటోలు తీసేందుకు అభిమానులు, యువత ఎగబడ్డారు.
బోనాల సందర్భంగా లాల్‌దర్వాజ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆడపడుచులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరు అమ్మవారికి బోనాలు సమర్పణ కొనసాగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల కోసం 6 క్యూలైన్లు ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. బోనం తీసుకొచ్చే వారికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు. కాగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..
సింహవాహిని అమ్మవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సింగర్ మంగ్లి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. సింహవాహిని అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టుపస్త్రాలు సమర్పించారు. కొండా సురేఖ, పొన్నంతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కలెక్టర్ ప్రియాంక అల బంగారు బోనం సమర్పించారు.
లాల్ దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ
🔸 లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నటుడు విజయ్ దేవరకొండ.
🔸 విజయ్‌తో పాటు ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక పూజలు.
🔸 బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న సినీ ప్రముఖులు.@TheDeverakonda #Bonalau |… pic.twitter.com/Az6p0UpJcN
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) August 9, 2026
సంబంధిత వార్తలు

KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు
ఆగస్టు 9, 2026

Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్ జల ఉద్యమం చేయాల్సిన పని లేదు.. ప్రజలే నీకు జల సమాధి కడతరు
ఆగస్టు 9, 2026

Vijay Deverakonda | బోనాల వేడుక – లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు
- ●Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్ జల ఉద్యమం చేయాల్సిన పని లేదు.. ప్రజలే నీకు జల సమాధి కడతరు
- ●Nayanthara | టాక్సిక్ కోసం పదేళ్ల రూల్ బ్రేక్ - నయనతారను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్
- ●Vijay Deverakonda | బోనాల వేడుక - లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు
- ●Cyber Crime | సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు తొందరగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్
- ●Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్యమం గురించి యువతరం తెలుసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు

Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్ జల ఉద్యమం చేయాల్సిన పని లేదు.. ప్రజలే నీకు జల సమాధి కడతరు

Nayanthara | టాక్సిక్ కోసం పదేళ్ల రూల్ బ్రేక్ - నయనతారను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్

Vijay Deverakonda | బోనాల వేడుక - లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు



