త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువ‌కు ప్ర‌తిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు

KTR | 'జల్, జంగల్, జమీన్' అని నినదించిన పోరాట యోధుడు కుమ్రం భీం తెగువకు ఆదివాసీలు ప్రతిరూపాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రకృతి పరిరక్షించ‌డంతో పాటు విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు వారు ప్రతీకలుగా నిలుస్తున్నార‌ని కొనియాడారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున బంజారాహిల్స్‌లో కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు.

S

Telangana | Published On Aug 9, 2026, 1.29 pm IST

KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువ‌కు ప్ర‌తిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు
Advertisement
  • హైద‌రాబాద్ న‌డిబొడ్డున కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని నిర్మించి గౌర‌వించాం
  • వారికి బీఆర్ఎస్ 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది
  • ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌కులు, విభిన్న సంస్కృతుల‌కు ప్ర‌తీక‌లు వారు
  • ఆదివాసీల‌కు ఎక్స్ వేదిక‌గా ప్ర‌పంచ ఆదివాసీ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌

త్రినేత్ర‌.న్యూస్: 'జల్, జంగల్, జమీన్' అని నినదించిన పోరాట యోధుడు కుమ్రం భీం తెగువకు ఆదివాసీలు ప్రతిరూపాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రకృతి పరిరక్షించ‌డంతో పాటు విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు వారు ప్రతీకలుగా నిలుస్తున్నార‌ని కొనియాడారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున బంజారాహిల్స్‌లో కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టారు.

 జోడేఘాట్‌లో స్మృతి వనం..

అడవులను, చెట్లను, పుట్టలను, జంతువులను ప్రేమించే, పూజించే గొప్ప వ్య‌క్తులు ఆదివాసీలు. ఎస్టీల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. తండాలను, గిరిజన గూడేలను గ్రామ పంచాయితీలు చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో ఆదివాసీ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టడమే కాకుండా, జోడేఘాట్‌లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసింది అని కేటీఆర్ వివ‌రించారు.

తండాలకు, గూడేలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయడం, ఎస్టీ గురుకులాలు, కాలేజీల సంఖ్య పెంచడం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించడం, సీఎంఎస్టీఈఐ స్కీం ద్వారా గిరిజన బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ హయాంలోనే జరిగాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement