త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో మూడురోజులు అతిభారీ వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన వాతావ‌ర‌ణ‌శాఖ‌

TG Weather | తెలంగాణ‌లో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని పేర్కొంది.

P

Telangana | Published On Aug 23, 2026, 3.54 pm IST

TG Weather | తెలంగాణ‌లో మూడురోజులు అతిభారీ వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన వాతావ‌ర‌ణ‌శాఖ‌
Advertisement

TG Weather | తెలంగాణ‌లో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం అల్ప‌పీడ‌నం వాయువ్య బంగాళాఖాతంలోనే స్థిరంగా ఉంద‌ని, అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంద‌ని తెలిపింది. రుతుపవన ద్రోణి సైతం ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా కొనసాగుతుండటంతో ప్రభావం స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ఆదివారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది.

ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అదే స‌మ‌యంలో సోమ‌వారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లిలో భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని చెప్పింది. అలాగే, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వాన‌లు పడుతాయ‌ని చెప్పింది. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్తూగెడం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది. ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావ‌ర‌ణ‌శాఖ‌.

 

 

 

Advertisement
Advertisement