Telangana | పాఠశాలల్లో ‘వాటర్ బెల్స్’.. కార్యాలయాల్లో ‘కూలింగ్ సెంటర్లు’..
Telangana | రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు.
Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఆలయాలకు వెళ్లే ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. వీరందరిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతీ పాఠశాలలో వాటర్ బెల్స్
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో వాటర్ బెల్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వాటర్ బెల్స్ అనేది తప్పనిసరి కార్యక్రమం అని స్పష్టం చేసింది. విద్యార్థులెవరూ కూడా డీహైడ్రేషన్‌కు గురికాకుండా.. చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రతి పాఠశాలలో తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. వాటర్ బెల్స్ విరామంలో ప్రతి విద్యార్థి నీరు తాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్‌వాడీలు 11 గంటల వరకే..
పొద్దున 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్లను ఉదయం 11 గంటల వరకే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. చిన్నారులను సురక్షితంగా వారి నివాసాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మాల్స్, కార్యాలయాల్లో కూలింగ్ సెంటర్లు
షాపింగ్ మాల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్యాలయాలన్నింటిలోనూ తప్పనిసరిగా కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ భవనాలు, ఆలయాలతో పాటు ఇతర సెంటర్లలోనూ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ వేడిమి నుంచి విశ్రాంతి తీసుకునేలా ఈ సెంటర్లు ఉండాలన్నారు. ఇక హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వడదెబ్బ బాధితులకు ప్రత్యేక వైద్యం..
వడగాల్పులతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి వెంటనే వైద్యం అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో ప్రత్యేక బృందం ఉండాలన్నారు. ఆస్పత్రులకు, నీటి సరఫరా కేంద్రాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎండ వేడిమికి సంభవించే అగ్నిప్రమాదాలను నివారించడానికి కెమికల్ గోడౌన్‌లలో అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



