త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిపై కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖకు చిక్కులు తెచ్చాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసుల పూర్తి వివరాలు ఇవే.

J

Telangana | Published On Aug 19, 2026, 9.20 pm IST

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

సంక్షిప్త సారాంశం

సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ (TPCC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. పచ్చ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ అంటూ గీసుకొండ సభలో సుష్మిత సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు సీనియర్ నేత జి. చిన్నారెడ్డికి నోటీసులు, జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.

Advertisement

Konda Surekha TPCC Notice | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సొంత పార్టీ అధిష్టానం వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేసిన కూతురు సుష్మిత పటేల్ (Sushmitha Patel) కామెంట్స్.. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) రాజకీయంగా చిక్కులు తెచ్చిపెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణ కమిటీ.. మంత్రికి అధికారికంగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

సీఎంపై సుష్మిత సంచలన వ్యాఖ్యలు

వరంగల్ జిల్లా గీసుకొండలో ఇటీవల తన బర్త్‌డే వేడుకల్లో కొండా సుష్మిత పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో "అచ్చమైన కాంగ్రెస్‌"కు, "పచ్చ కాంగ్రెస్‌ (టీడీపీ నుంచి వచ్చిన నేతలు)"కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. పరకాల నియోజకవర్గ పర్యటనలో ఎమ్మెల్యే రేవూరికి సీఎం రేవంత్ బహిరంగ మద్దతు ప్రకటించడం సుష్మిత అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.

ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పరకాల నుంచే పోటీ చేస్తానని సుష్మిత అదే సభలో తేల్చి చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా సరే.. ఇండిపెండెంట్‌గా (Independent) బరిలోకి దిగుతానని హైకమాండ్‌కు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్‌ను దాటి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

యాక్షన్‌లోకి దిగిన క్రమశిక్షణ కమిటీ

ఈ ఎపిసోడ్‌పై TPCC క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఎంతటి వారైనా సరే 'లక్ష్మణ రేఖ' దాటితే యాక్షన్ తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇమేజ్‌ను, పార్టీ డిసిప్లిన్‌ను డ్యామేజ్ చేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను ఆదేశించారు. ఇప్పుడు ఈ నోటీసులపై మంత్రి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

మరికొందరిపై కూడా యాక్షన్

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రక్షాళన మొదలైంది. వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేపై ఓ సభలో యాంటీ-పార్టీ (Anti-party) కామెంట్స్ చేసినందుకు గాను.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత డాక్టర్ జి. చిన్నారెడ్డికి కూడా కమిటీ నోటీసులు పంపింది. అలాగే, కులాల పేరుతో దూషించినట్లు పక్కా ఆధారాలు (Evidences) లభించడంతో ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Advertisement
Advertisement