Wanaparthy | రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించేందుకే “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర”
Wanaparthy | జ్ఞాన చైతన్య బస్సు యాత్ర ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రాజ్యాంగ హక్కులు, విద్యా అవకాశాలు, ఉపాధి పథకాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించడం జరుగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి పేర్కొన్నారు.
Wanaparthy | త్రినేత్ర.న్యూస్ : జ్ఞాన చైతన్య బస్సు యాత్ర ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రాజ్యాంగ హక్కులు, విద్యా అవకాశాలు, ఉపాధి పథకాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించడం జరుగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి చేపట్టిన “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర” జోగులాంబ గద్వాల జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకొని నేడు వనపర్తి జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్బంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ మల్లు రవి ప్రత్యేక శ్రేద్దతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు, ఇతర బడుగు, బలహీన వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ జ్ఞాన చైతన్య బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలు తమ హక్కుల పట్ల చైతన్యవంతులై ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, సామాజిక సమానత్వం సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల హక్కుల సాధనలో ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తీమ్మప్ప, మాజీ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యాత్రకు తమ మద్దతు తెలిపారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క
జూన్ 8, 2026

Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
జూన్ 8, 2026

Dasoju Sravan Kumar | తెలంగాణ జనాక్రోశమే ఈ కవిత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
- ●Peddi | మరో వివాదంలో పెద్ది - అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల డిమాండ్
- ●Airtel | ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలను సమర్థించుకున్న ఎయిర్ టెల్.. నిబంధనల ఉల్లంఘన లేదని స్పష్టీకరణ..
- ●Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!
- ●Dasoju Sravan Kumar | తెలంగాణ జనాక్రోశమే ఈ కవిత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం
- ●N Ramachander Rao | హిట్లర్ లాగే రేవంత్ ప్రభుత్వానికి మరణం తప్పదు : ఎన్ రామచందర్ రావు

Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

Peddi | మరో వివాదంలో పెద్ది - అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల డిమాండ్

Airtel | ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలను సమర్థించుకున్న ఎయిర్ టెల్.. నిబంధనల ఉల్లంఘన లేదని స్పష్టీకరణ..

Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!



