Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!
Traffic Restrictions | ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు పేరిట బహిరంగ సభ నిర్వహించనుంది. మహిళా సదస్సు నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు పేరిట బహిరంగ సభ నిర్వహించనుంది. మహిళా సదస్సు నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రత్యేక మళ్లింపులు చేపట్టనున్నారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్, జేబీఎస్, ప్యారడైజ్, ప్యాట్నీ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆ రహదారి మూసివేత
మహిళా సదస్సు నేపథ్యంలో టీవోలీ క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు రహదారి మూసివేయబడుతుంది. హెల్ప్‌లైన్ కోసం 8712662999 నంబర్‌ను సంప్రదించొచ్చు. సాధ్యమైనంత వరకు మెట్రో సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులకు పోలీసులు సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి
- ●Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
- ●Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?
- ●Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి

Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!

Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!






