Bandi Bhageerath | పరారీలో ఉన్నాడు.. బండి భగీరథ్‌పై నిజామాబాద్‌లోనూ వెలసిన పోస్టర్లు
Bandi Bhageerath | మొన్న హైదరాబాద్, నిన్న కరీంనగర్.. నేడు నిజామాబాద్. పోక్సో కేసు నిందితుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Bandi Bhageerath) కనిపించడం లేదనే పోస్టర్లు వెలుస్తూనే (Wall Posters) ఉన్నాయి.
Bandi Bhageerath | త్రినేత్ర.న్యూస్: మొన్న హైదరాబాద్, నిన్న కరీంనగర్.. నేడు నిజామాబాద్ (Nizamabad). పోక్సో కేసు నిందితుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Bandi Bhageerath) కనిపించడం లేదనే పోస్టర్లు వెలుస్తూనే (Wall posters) ఉన్నాయి. భగీరథ్ పరారీలో ఉన్నాడంటూ.. నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలో పోస్టర్లు అంటించారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, గోడలపై ఈ పోస్టర్లు కనిపించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. వాహనదారులు, పాదచారులు పోస్టర్లను చూస్తూ చర్చించుకుంటున్నారు.

కాగా, బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బండి భగీరథ్ అబ్‌స్కాండింగ్ అంటూ, గురువారం కరీంనగర్‌లో పరారీలో ఉన్నాడంటూ పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే.

ముందస్తు బెయిల్‌పై నేడు తీర్పు
బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు (High Court) శుక్రవారం తీర్పు వెలువరించనుంది. కేసులో కీలక అంశంగా మారిన బాధితురాలి వయస్సుపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు పోలీసులను గురువారం ఆదేశించింది. ఈనేపథ్యంలో కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా బాధితురాలి పుట్టిన తేది వివరాలపై న్యాయమూర్తి పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆమె మైనర్ కాదని, మేజర్ అని ఎలా నిరూపిస్తారని పిటిషనర్‌ను ప్రశ్నించారు. ఐదేళ్ల కిందట నమోదైన ఓ ట్రాఫిక్ కేసులో ఆ యువతి కారు నడిపిన సమయంలో కేసు నమోదైందని, ఆ సమయంలో 15 వేళ్ల వయసు అని పేర్కొన్నారన్నారు.
అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వివరాలు సరైనవే అయితే తాను మేజర్ అవుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టులో వాదించారు. సదరు యువతి పలు రకాల తేదీలతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుందన్నారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిషనర్ రాడని, బీఎన్ఎస్ సెక్షన్ 74,75 ప్రకారం ఆరోపించిన నేరాలు రుజువు కాలేదని వాదించారు. బాధితురాలుగా పేర్కొంటున్న ఆమె వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుందని తెలిపింది. ఆమె తల్లి తప్పుడు రికార్డులు సృష్టించి, వయసును తగ్గించి కఠినమైన ఫోక్సో చట్టం కింద నమోదు చేయించారన్నారు. ఎనిమిది నెలల కిందట జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.
ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫిర్యాదు చేసిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు రూ.5 కోట్లు డిమాండ్ చేశారని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ బెదిరింపులపై తాము కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాను ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రకు పాల్పడ్డారని బండి భగీరథ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న కోర్టు.. బాధితురాలి పుట్టిన తేదీ వివరాలపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశిస్తూ శుక్రవారానికి వాయిదా వేసింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



