త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల‌ విద్యార్థులకు పాలు.. విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్‌

Telangana | ప్రభుత్వ విద్యాసంస్థ‌ల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్రా స‌ర్కార్ (Telangana) ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఒక‌టి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివే విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అంద‌జేయాల‌ని నిర్ణయించింది.

G

Telangana | Published On Apr 9, 2026, 6.59 am IST

Telangana | ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల‌ విద్యార్థులకు పాలు.. విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్‌
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రభుత్వ విద్యాసంస్థ‌ల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్రా స‌ర్కార్ (Telangana) ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఒక‌టి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివే విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అంద‌జేయాల‌ని నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న రాగి జావతో పాటు, ఈ పాలు అందించ‌నుంది. ఇందులో భాగంగా విద్యాశాఖ.. పాల పంపిణీ కోసం రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ)కు తొలి విడతగా రూ.120 కోట్ల ఆర్డర్‌ ఇచ్చింది. జూన్‌లో పాఠశాలలు తెరిచిన‌ప్ప‌టి నుంచి పాలు సరఫరా చేయాలని ఆదేశించింది.

విజయ డెయిరీ ప్రస్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలకు 200 మిల్లీ లీటర్ల టెట్రాప్యాక్‌లలో పాలు సరఫరా చేస్తున్న‌ది. ఇటీవల ములుగు జిల్లా పరిధి అంగన్‌వాడీ కేంద్రాల్లోని 3-5 ఏండ్ల‌ చిన్నారులకు 100 మిల్లీలీట‌ర్ల‌ టెట్రాప్యాక్‌లలో సరఫరాను ప్రారంభించింది. ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా టెట్రాప్యాక్‌లోనే పాలు సరఫరా చేయ‌డానికి విజయ డెయిరీ సిద్ధమవుతున్న‌ది.

Advertisement
Advertisement