త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaddiraju Ravichandra | మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ప్ర‌క‌టించాలి.. ఎంపీ వద్దిరాజు డిమాండ్

Vaddiraju Ravichandra | సామాజిక విప్లవకారులు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకు (Jyothirao Phule) భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Apr 11, 2026, 1.20 pm IST

Vaddiraju Ravichandra | మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ప్ర‌క‌టించాలి.. ఎంపీ వద్దిరాజు డిమాండ్
Advertisement

Vaddiraju Ravichandra | త్రినేత్ర‌.న్యూస్‌: సామాజిక విప్లవకారులు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకు (Jyothirao Phule) భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల విద్యా వికాసం, సమసమాజం కోసం అహర్నిశలు కృషి చేసిన మ‌హ‌నీయుడు పూలే అన్నారు. ఆయ‌న‌కు దేశ అత్యున్న‌త పౌర‌ పుర‌స్కార‌మైన‌ భారతరత్న ప్రకటించాల్సిందిగా పార్లమెంట్ వేదికగా తాను పోరాడుతాన‌ని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మహాత్మా పూలే జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష‌ నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరుల‌తో క‌లిసి పూలేకు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

అనంత‌రం ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. పూలేకు భారతరత్న ప్రకటించడం గౌరవంగా, సముచితంగా ఉంటుందన్నారు. జనాభాలో సగ భాగం ఉన్న మహిళలు కూడా చదువుకోవాలని, తద్వారా కుటుంబాలు, దేశం పురోభివృద్ధి చెందుతుందని, అందుకోసం కృషి చేసిన పూలే దార్శనికులని కొనియాడారు. ఆ మహాత్ముని స్ఫూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాలలోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ అమలు జరగాలంటూ తీర్మానించి కేంద్రానికి సిఫార‌సు చేశార‌ని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్ల‌ అమలు కోసం ఈనెల 16, 17, 18తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నదని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement