త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRESA | ట్రెసా అధ్య‌క్షులుగా కే గౌత‌మ్ కుమార్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎల్ ర‌మ‌ణ్ రెడ్డి

TRESA | తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్(ట్రెసా) అధ్య‌క్షులుగా కే గౌత‌మ్ కుమార్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎల్ ర‌మ‌ణ్ రెడ్డిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

S

Telangana | Published On Sep 6, 2026, 9.29 pm IST

TRESA | ట్రెసా అధ్య‌క్షులుగా కే గౌత‌మ్ కుమార్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎల్ ర‌మ‌ణ్ రెడ్డి
Advertisement

TRESA | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్(ట్రెసా) అధ్య‌క్షులుగా కే గౌత‌మ్ కుమార్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎల్ ర‌మ‌ణ్ రెడ్డిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రెసా పూర్వ అధ్య‌క్షులు వంగ ర‌వీంద‌ర్ రెడ్డి ఆగ‌స్టు 31న ప‌ద‌వీ విర‌మ‌ణ ఆయ‌న నేప‌థ్యంలో గ‌త ఏడేండ్లుగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న కే గౌత‌మ్ కుమార్‌ను రాష్ట్ర అధ్య‌క్షులుగా ఎన్నుకున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షులుగా సుదీర్ఘ కాలం సేవ‌లందిస్తున్న ఎల్ ర‌మ‌ణ్ రెడ్డిని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నుకున్న‌ట్లు రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం తీర్మానించింది.

ఈ సందర్బంగా కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు కె. గౌతమ్ కుమార్, ప్ర‌ధాన‌ కార్యదర్శి ఎల్. రమణ్‌ రెడ్డిలు మాట్లాడుతూ.. తమను ఎన్నుకున్నందుకు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డికి, ట్రెసా కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని, రెవెన్యూ అసోసియేషన్ కీర్తి, ప్రతిష్టలను మరింత పెంచుతామని అలాగే రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడతామని, రెవెన్యూ శాఖ ఉన్నతికి పాటుపడుతూ, ప్రభుత్వం అందించే సంక్షేమఫలాలను ప్రజలకు చేరవేయడానికి అలాగే రెవెన్యూ సేవలు సకాలంలో అందేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ట్రెసా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం కలిగి గుర్తింపు పొందిన సంఘంగా ఉద్యోగుల జేఏసీలో కీలక సంఘంగా ఉంది. ఈ సందర్బంగా ట్రెసా పూర్వ అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డిని గౌరవ అధ్యక్షులుగా ట్రెసా కార్యవర్గం నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి. రాజ్ కుమార్, ఎండీ రియాజుద్దీన్, కోశాధికారి బి. వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షులు నిరంజన్ రావు, సీఎల్బి శాస్త్రి, మనోహర్ చక్రవర్తి, రాష్ట్ర సమన్వయ కర్త ఎం. నారాయణ రెడ్డి, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ జి. దేశ్య నాయక్, కార్యదర్శులు జగన్ మోహన్ రెడ్డి, కృష్ణ చైతన్య, చంద్ర శేఖర్, ఆర్గనైసింగ్ సెక్రటరీలు బొమ్మ రాములు, వెంకటేశ్వర్లు, నజీమ్ ఖాన్, సంయుక్త కార్యదర్శులు కిషన్ నాయక్, బి. కృష్ణయ్య, బి. జయరాం, విక్రమ్ అలాగే సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షులు మూర్తుజా, ట్రెసా మాజీ నాయకులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్లు మన్నె ప్రభాకర్, ఎల్లారెడ్డి, అంజిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద ఎత్తున రెవెన్యూ ఉద్యోగులు హాజరై నూతన అధ్యక కార్యదర్శులను గజమాలలతో సన్మానించి, డప్పు వాయిద్యాలతో అలాగే బాణాసంచా కాల్చి ఆనందోత్సాహలతో సంబరాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement
Advertisement