Urea App | ఇక క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఇక ఇంటి నుంచే ‘యూరియా’ బుకింగ్
Urea App | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభవార్త వినిపించారు. గతంలో మాదిరిగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా, రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
Urea App | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభవార్త వినిపించారు. గతంలో మాదిరిగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా, రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతు నేస్తం కార్యక్రమం ఎపిసోడ్ 95 వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ఆదర్శంగా తీసుకొని, భారత ప్రభుత్వం "Framework for Fertilizer Sale" మొబైల్ యాప్‌ను రూపొందించిందని తెలిపారు. ఈ యాప్‌ను రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల అస్థిర వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి ద్వారా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు యూరియా పంపిణీ, వినియోగంపై విలువైన సూచనలు అందించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకున్న రైతులు, ఎరువుల డీలర్లతో రైతు నేస్తం లైవ్ కార్యక్రమం ద్వారా పరస్పర చర్చలు నిర్వహించారు.

హనుమకొండకు చెందిన రైతు మురళీధర్ ప్రకృతి వ్యవసాయం, బయో-ఇన్‌పుట్ వనరుల తయారీ, వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. తెలంగాణ ఫర్టిలైజర్ యాప్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ యూరియా బుకింగ్ యాప్ గురించి కూడా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డి, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ (APC), వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర మోహన్, వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,600 రైతు వేదికల ద్వారా రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?



