22A lands | 22ఏ కు మోక్షమెలా?
22A lands | ప్రభుత్వం ఆదేశించినా 22 ఏ దరఖాస్తులకు ఇంకా విముక్తి కలగడం లేదు. 15 రోజుల్లోనే వాటిని పరిష్కరిస్తామని సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు నెలలోనే చెప్పినా.. ఇప్పటి వరకు బాధితులకు పరిష్కారం దక్కలేదు. ప్రభుత్వం ఆర్భాటంగా హామీ ఇచ్చినా.. అది అమలు కాకపోవడంతో బాధితులు మాత్రం స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నారు.
పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు
ఎన్ని క్లియర్ చేశారో
ఇప్పటికీ వెల్లడించని ప్రభుత్వం
మంత్రులు సిఫారస్ చేసిన ఆస్తులకే ఉపశమనం
మిగతా ఆస్తులన్నీ ఇంకా నిషేధిత జాబితాలోనే
రాష్ట్ర వ్యాప్తంగా 24,813 అప్లికేషన్లు పెండింగ్
15 రోజుల్లోనే పరిష్కరిస్తామని
ఆగస్టు నెలలో మంత్రి పొంగులేటి హామీ
40 రోజుల్లో పరిష్కరించాలంటూ
3 నెలల కిందట రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆదేశాలు
22A lands | త్రినేత్ర న్యూస్ : ప్రభుత్వం ఆదేశించినా 22 ఏ దరఖాస్తులకు ఇంకా విముక్తి కలగడం లేదు. 15 రోజుల్లోనే వాటిని పరిష్కరిస్తామని సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు నెలలోనే చెప్పినా.. ఇప్పటి వరకు బాధితులకు పరిష్కారం దక్కలేదు. ప్రభుత్వం ఆర్భాటంగా హామీ ఇచ్చినా.. అది అమలు కాకపోవడంతో బాధితులు మాత్రం స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నారు.
ఒక్క ఫైల్ కూడా క్లియర్ కాలేదు
22ఏ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గత ఆగస్టు నాటికి 24,813 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం వీటిని పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేసినా.. తమకు సంబంధించి ఎన్ని సార్లు తిరిగినా ఫైల్ కూడా క్లియర్ కావడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం మంత్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని చెప్పిన ఆస్తులకే అధికారులు కొంత ఉపశమనం కలిగేలా చేయగలుతున్నారని సమాచారం. మంత్రులు పదే పదే ఒత్తిడి తీసుకొస్తుండడంతో వారు చెప్పిన ఆస్తులను సాఫ్ట్‌వేర్‌లో.. ప్రొహిబిటెడ్ ఆస్తుల డిస్ ప్లేలో లేకుండా మాత్రమే చేయగలుగుతున్నారు.
ఎన్ని పరిష్కరించారు?
3 నెలల నుంచి 22 ఏ దరఖాస్తులపై ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉన్నది. కానీ ఇప్పటికి ఎన్ని దరఖాస్తులకు మోక్షం కలిగించారో ఇప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి అసలు సమాచారమే లేదు. పదిహేను రోజుల్లో పరిష్కారిస్తామని మంత్రి ఇచ్చిన హామీకే విలువ లేకుండా పోయిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bengaluru to Goa Vande Bharat Express | బెంగళూరు నుంచి గోవాకు సరికొత్త 'వందే భారత్'.. రూట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
- ●Ponguleti Srinivas Reddy | అప్పులున్నా, ఎన్ని తిప్పలున్నా ఇందిరమ్మ ఇళ్లు ఆగవ్.. ఇది ఎప్పటికీ జరిగే ప్రక్రియ
- ●UPSC Civils | సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది ఎంపిక.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహం
- ●Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణికి అరుదైన గౌరవం
- ●Jagga Reddy | రాష్ట్రమిచ్చిన సోనియానే రాసుకోవాల్నా.. తీసుకున్న మనం రాయాలి
- ●Kishan Reddy | అది భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్

Bengaluru to Goa Vande Bharat Express | బెంగళూరు నుంచి గోవాకు సరికొత్త 'వందే భారత్'.. రూట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Ponguleti Srinivas Reddy | అప్పులున్నా, ఎన్ని తిప్పలున్నా ఇందిరమ్మ ఇళ్లు ఆగవ్.. ఇది ఎప్పటికీ జరిగే ప్రక్రియ

UPSC Civils | సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది ఎంపిక.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహం

Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణికి అరుదైన గౌరవం




