త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అప్పులున్నా, ఎన్ని తిప్ప‌లున్నా ఇందిర‌మ్మ ఇళ్లు ఆగ‌వ్‌.. ఇది ఎప్ప‌టికీ జ‌రిగే ప్ర‌క్రియ‌

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ చేసిన లక్ష‌ల కోట్ల‌ అప్పులు, ఎల్‌నినో వ‌ల్ల ఎన్ని తిప్ప‌లున్నా ఇందిర‌మ్మ ఇళ్లు (Indiramma Houses) ఆగ‌వని.. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Nov 12, 2026, 7.19 pm IST

Ponguleti Srinivas Reddy | అప్పులున్నా, ఎన్ని తిప్ప‌లున్నా ఇందిర‌మ్మ ఇళ్లు ఆగ‌వ్‌.. ఇది ఎప్ప‌టికీ జ‌రిగే ప్ర‌క్రియ‌
Advertisement
  • ఆడ‌బిడ్డ‌ల క‌ళ్ల‌ల్లో ఆనంద‌బాష్పాలే మాకు ఆశీస్సులు
  • వ‌చ్చే దీపావ‌ళి నాటికి క్యూర్ ప‌రిధిలోని ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ పూర్తి చేస్తం
  • మైలార్‌దేవుప‌ల్లి ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణానికి శంకుస్దాప‌నలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్‌: బీఆర్ఎస్ చేసిన లక్ష‌ల కోట్ల‌ అప్పులు, ఎల్‌నినో వ‌ల్ల ఎన్ని తిప్ప‌లున్నా ఇందిర‌మ్మ ఇళ్లు (Indiramma Houses) ఆగ‌వని.. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే దీపావ‌ళి నాటికి క్యూర్ ప‌రిధిలోని ఇళ్ల‌ను పూర్తి చేస్తామ‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ల‌బ్ధిదారులు ఆ ఇళ్ల‌లో దీపావ‌ళి జ‌రుపుకోవాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నామ‌న్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్, మ‌హేశ్వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మైలార్ దేవుప‌ల్లిలో గురువారం ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌ గౌడ్‌తో క‌లిసి పొంగులేటి శంకుస్ధాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

క‌ళ్లు చెమ‌రుస్తున్న‌య్‌

పేదవాడి జీవితాశ‌య‌మైన సొంత ఇంటిని ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని మ‌రో మూడు విడ‌త‌లు ఇళ్లు మంజూరు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. క్యూర్ ప‌రిధిలోని 23 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల కేటాయింపు పార‌ద‌ర్శ‌కంగా, కుల‌మతాలు, పార్టీల భేదాలు లేకుండా కేటాయింపు జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం ఇళ్లు పొందిన ల‌బ్దిదారుల‌ కంట ఆనంద‌బాష్పాలు చూస్తుంటే ఈ ప్ర‌భుత్వానికి, త‌మ‌కు ఇంత‌కంటే ఇంకేం కావాల‌నిపిస్తుంద‌ని గ‌ద్గ‌ద‌స్వ‌రంతో సంతోషం వ్య‌క్తం చేశారు. వారి స్పంద‌న చూస్తే త‌మ‌కు కూడా క‌ళ్లు చెమ‌రుస్తున్నాయ‌న్నారు. వారి ఆనంద‌భాష్పాలే త‌మ‌కు ఆశీస్సుల‌న్నారు.

చిల‌కాకుప‌చ్చ చీర‌లు..

గ‌త పాల‌కులు పేద‌ల ఇళ్ల నిర్మాణం విష‌యంలో సొల్లుపురాణం చెప్పార‌ని, ఇప్పుడు కూడా ఇళ్ల నిర్మాణం, ఫోర్త్‌ సిటీ విష‌యంలో అవాకులు చ‌వాకులు పేలుస్తున్నార‌ని ఆరోపించారు. ఏది ఏమైనా ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు ప్ర‌ధాన హామీల‌ను నెర‌వేరుస్తుంద‌న్నారు. ఈనెల 19 నుంచి నాణ్య‌మైన చిల‌కాకుప‌చ్చ రంగు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.

అంత‌కుముందు ఇక్క‌డ నిర్మించే ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ ల‌బ్దిదారుల ఎంపిక కోసం ల‌క్కీడ్రా నిర్వ‌హించారు. తొలుత క‌విత రాధోడ్ అనే మ‌హిళ‌కు సి బ్లాక్‌లో 603 ఫ్లాట్ మంజూరు కాగా మంత్రులు పొంగులేటి, శ్రీ‌ధ‌ర్‌బాబు క‌లిసి ఆమెకు స‌ర్టిఫికేట్ ను అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చ‌న్న‌గారి ల‌క్ష్మారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఎండీ వి.పి. గౌత‌మ్, రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి, మాజీ మేయ‌ర్ పారిజాతం, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement