CM Revanth Reddy | ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడుతా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఉప్పల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి విగ్రహం పెడుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 50 ఏండ్ల పాటు రాజిరెడ్డి ఉప్పల్‌లో సేవలందించారని సీఎం గుర్తు చేశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఉప్పల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి విగ్రహం పెడుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 50 ఏండ్ల పాటు రాజిరెడ్డి ఉప్పల్‌లో సేవలందించారని సీఎం గుర్తు చేశారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఎంఎంసీ ఆఫీసుకు శంకుస్థాపన సందర్భంగా సీఎం ప్రసంగించారు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టాను. ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి బీఆర్ఎస్‌లో ఉన్నాడు. రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే రాజిరెడ్డి పేరు పెట్టేవాడినా ఆలోచించండి. ఆయన పేరు చిన్న పిల్లాడికి కూడా తెలుసు. ఆయన కాలనీల్లో పర్యటించడంతో అందరితో అనుబంధం ఉంది. పార్లమెంట్‌కు పోటీ చేసినప్పుడు మంచి పిలగాడు.. పని చేస్తాడు ఓటు వేయమని స్థానికులకు చెప్పిండు. కష్టాల్లో ఉన్నప్పుడు రాజిరెడ్డి సాయం అందించారు. ఈ ప్రాంతానికి 50 ఏండ్ల పాటు సేవలందించాడు. మరి ఆయన పేరు పెట్టు న్యాయమా.. కాదా ఆలోచించండి అని సీఎం అడిగారు.
ఈ పేరు పెట్టడమే కాదు... ఎవరు ఏడ్చినా.. బాధ పడ్డా.. చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడుదాం.. ఏర్పాట్లు చేసుకోండి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. కానీ మంచిని మంచిగా చూద్దాం అని సీఎం అన్నారు.
తాజావార్తలు
- ●Gold Diamond Ring | పెండ్లి వేడుకలో బంగారు వజ్రాల ఉంగరం మాయం.. ఈవెంట్ మేనేజర్‌పై..
- ●ITBP Recruitment | ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. సెకండ్ కమాండెంట్ హోదా..
- ●Horoscope | ఆగస్టు 5 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!
- ●Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Gold Diamond Ring | పెండ్లి వేడుకలో బంగారు వజ్రాల ఉంగరం మాయం.. ఈవెంట్ మేనేజర్‌పై..

ITBP Recruitment | ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. సెకండ్ కమాండెంట్ హోదా..

Horoscope | ఆగస్టు 5 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?






