Hyderabad Metro | మెట్రో లోన్ ఎందుకు ఆగిందంటే… సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ
Hyderabad Metro | రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి ఉండదు.. ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను దొడ్డిదారిన అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
Hyderabad Metro | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి ఉండదు.. ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను దొడ్డిదారిన అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.
మెట్రోను ఎల్ఆండ్ టీ నుండి స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. ఆ కంపెనీకి 15000 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పరేషన్ వద్ద 13,600 కోట్ల రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కొన్ని షరతులు విధించింది. మెట్రో ఫేజ్ 1 ఇప్పటికే నష్టాల్లో ఉంది. ఢిల్లీ మెట్రో కూడా నష్టాల్లో ఉంది. అయితే నష్టాల్లో ఉన్న ఈ మెట్రో లు ఆగిపోకూడదని కొన్ని నిబంధనలు విధించింది.. టికెట్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముందుగా మెట్రో రోజువారీ నిర్వహణకే వినియోగించాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంతో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో రైలు సజావుగా నడిచేందుకే కేంద్రం ఈ షరతు విధించింది. ఇందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోలేదు. టికెట్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ముందు... రుణాలు చెల్లిస్తామని అంటున్నది. ఇలా చేస్తే నిర్వహణకు నిధులు కరువై నెలనెలా మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుంది. మెట్రో ఆర్థిక సుస్థిరత కోసమే కేంద్రం ఈ షరతులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోకపోవడంతో రుణం ఆగిపోయింది. అయితే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. భవిష్యత్‌లో కూడా ఉంటాం. మూసీ పునరుజ్జీవం కోసం 4100 కోట్ల రుణం అడిగితే.. దానికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ముందుకు వస్తే కేంద్రం ఎన్‌వోసీ ఇచ్చింది. అంతేకాకుండా కేంద్రం కోఆపరేటివ్ శాఖ పరిధిలోని ఎన్సీడీసీ ద్వారా ఇప్పటి వరకు 10 ఏండ్లుగా లక్ష కోట్లు తెలంగాణకు మంజూరు చేశాం. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 37 వేల కోట్లు మంజూరు చేసింది.. 34 వేల కోట్లు రాష్ట్రానికి ఎన్సీడీసీ అందించింది ఇప్పటికే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
జులై 13, 2026

Shyam Prasad Reddy | “జైలుకు పంపుతారా? ఆరోజు కేసీఆర్ కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు!”.. రేవంత్ వ్యాఖ్యలపై కన్నీరుపెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్
జులై 12, 2026

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
జులై 12, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



