Maheshkumar Goud | దామోదర, జగ్గారెడ్డితో కలిపి నా ఓటు పోయినా ఆశ్చర్యం లేదు
Maheshkumar Goud | SIRలో దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డితో సహా నా ఓటు గల్లంతయిన ఆశ్చర్యం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. మా ఓట్లు క్షేమంగా ఉండాలంటే బీఎల్ఏలు కీలకంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందన్నారు.
- అందుకే మా ఓట్లు ఉండాలంటే బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
- బీజేపీకి పడని ఓట్లను తీసేస్తున్నరు
- అధికారంలో ఉండి చక్రవర్తులు అనుకుంటున్నరు
- పెద్ద పెద్ద చక్రవర్తులే పోయారు.. ఇక మోదీ అమిత్‌షాలు ఎంత?
- చీఫ్ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారింది
- సంగారెడ్డిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
Maheshkumar Goud | త్రినేత్ర.న్యూస్: SIRలో దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డితో సహా నా ఓటు గల్లంతయిన ఆశ్చర్యం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. మా ఓట్లు క్షేమంగా ఉండాలంటే బీఎల్ఏలు కీలకంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు జరుగుతున్న SIR ప్రక్రియలో బీజేపోళ్లకు పడని ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందన్నారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన సర్ అవగాహన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మతతత్వ పార్టీలకు ప్రయోజనం చేకూరేలా SIR ప్రక్రియ నిర్వహించే కుట్ర జరుగుతుంది. నిరంతరం అధికారంలో ఉండి చక్రవర్తుల్లా ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. మీకంటే పెద్ద చక్రవర్తులే నేలమట్టమయ్యారు. మోదీ, అమిత్ షాలు ఎంత? అధికారం శాశ్వతం అనుకుంటే వారు మూర్ఖులే. బెంగాల్‌లో SIR పేరుతో 92 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారు అని మహేశ్‌కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.

23 మీనాక్షితో మరో మీటింగ్ ఉంటది..
ఈనెల 23న ఆందోల్‌లో మీనాక్షి నటరాజన్‌తో కలిసి SIRపై మరో సమావేశం ఉంటుంది. యావత్ ప్రపంచంలో భారత్ ప్రజాస్వామ్యం కలిగిన దేశం. 2002లో SIR ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. తెలంగాణ ఎందుకు ఇవ్వాలో సోనియాగాంధీకి చెప్పి ఒప్పించిన నాయకుడు దామోదర రాజనర్సింహ. రాజకీయాల్లో దామోదర నాకు ఓనమాలు నేర్పించారు అని ఆయన గుర్తు చేశారు.
దేవుళ్ల పేరుతో ఓట్లు అడగం..
దేశంలో అతికొద్ది నిజాయితీపరుల్లో ఒకరు మీనాక్షి నటరాజన్. అకారణంగా ఆమె నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ వాళ్లకు కనికరం లేదు. దేవుళ్లకు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ దేవుడి పేరు చెప్పనిదే బీజేపీ వాళ్లకు ఓట్లు పడవు. జై శ్రీరామ్ అనే పదం అందరికి వర్తిస్తుంది. జగ్గారెడ్డి ఏడాదిలో అనేకసార్లు పూజలు చేస్తారు. మేం దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే వాళ్లం కాదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. ఈ దేశాన్ని ఎవరు రక్షించరు.. మనమే రక్షించుకోవాలి. మతం పేరుతో ప్రజలు ఓట్లు వేయరు అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

కేసీఆర్‌పై గౌరవం ఉంది..
కేసీఆర్ ఉద్యమంలో ఉన్నాడు. ఆయనపై మాకు గౌరవం ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేం ఇప్పటి వరకు 80 వేల ఉద్యోగాలు ఇచ్చాం. డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేస్తే.. మేం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. కేసీఆర్ హయాంలో ప్రయివేటు ఆస్పత్రులు బాగుపడ్డాయి. కాంగ్రెస్ హయాంలో PHC నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేశాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని మహేశ్‌కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చినప్పుడు 10 రోజులు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన వెనుక బీజేపీ ఉంది. కమలం పార్టీ ఆడించినట్టే.. పవన్ ఆడుతున్నారు. మీ సానుభూతి మాకేం అవసరం లేదు. మీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి...
సీఎం రేవంత్ అన్ని తప్పులు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు. ఈ 12 ఏళ్లల్లో మీరు ఏం చేశారో చిట్టా ఇవ్వండి. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా నిధులు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విభజన హామీలను నెరవేర్చలేదు. మీరు సబర్మతి కట్టుకోవచ్చు. మేం మూసీ ప్రక్షాళన చేస్తామంటే నిధులు ఇవ్వరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాలి. ఓ వైపు బీజేపీ, మరో వైపు బీఆర్ఎస్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయి అని టీపీసీసీ మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!





