Amarajyothi Memorial | అమరజ్యోతిని సందర్శించిన ఉద్యమకారుల కమిటీ..
Amarajyothi Memorial | హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకం ‘అమరజ్యోతి’ ప్రాంగణంలో శనివారం సందడి కనిపించింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు అమరజ్యోతిని సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
Amarajyothi Memorial | హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకం ‘అమరజ్యోతి’ ప్రాంగణంలో శనివారం సందడి కనిపించింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు అమరజ్యోతిని సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. కమిటీ సభ్యులు ప్రాంగణంలోని వివిధ గదులను పరిశీలించడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆడియో–విజువల్ రూమ్‌ను సందర్శించారు. అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించేలా రూపొందించిన ఏర్పాట్లను దగ్గరగా పరిశీలించారు.
అనంతరం కమిటీ చైర్మన్ కే కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వివిధ రూపాల్లో పాల్గొన్న ఉద్యమకారులను రాజకీయాలకు అతీతంగా గుర్తించే విధానంపై కమిటీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ నుంచి అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు వంటి వర్గాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నారు. అలాగే, ఉద్యమ సమయంలో పనిచేసిన ప్రజా సంఘాలు, ఉద్యమకారుల సంక్షేమ కమిటీలు సహా వివిధ వర్గాలతో దశలవారీగా చర్చలు జరిపి సమగ్ర సమాచారం సేకరించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో సూచనలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది.
ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయనుండగా, ఆఫ్‌లైన్‌లో ఉద్యమకారులు తమ ప్రతినిధ్యాలు సమర్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. అందిన సూచనలు, అభిప్రాయాలను క్రమబద్ధంగా నమోదు చేసి తదుపరి చర్యలకు ఉపయోగించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమం ద్వారా తెలంగాణ ఉద్యమంలో భాగమైన ప్రతి వర్గం గొంతుకను వినే అవకాశం లభిస్తుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



