త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sai Bhagirath | పరారీలో బండి సాయి భ‌గీర‌థ్‌..! ఫోన్ స్విచ్ఛాప్..!!

Bandi Sai Bhagirath | కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భ‌గీర‌థ్ పరారీ అయిన‌ట్లు విశ్వ‌సనీయ స‌మాచారం. ఆదివారం ఉద‌యం నుంచి భ‌గీర‌థ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

S

Telangana | Published On May 10, 2026, 4.47 pm IST

Bandi Sai Bhagirath | పరారీలో బండి సాయి భ‌గీర‌థ్‌..! ఫోన్ స్విచ్ఛాప్..!!
Advertisement

బాధితురాలు మైన‌ర్‌గా నిర్ధార‌ణ‌
భ‌రోసా సెంట‌ర్‌లో అమ్మాయి
లైంగిక‌దాడి నిజ‌మ‌ని తేలితే త‌దుప‌రి చ‌ర్య‌లు
ఈ కేసు వ్య‌వ‌హారంపై
రాష్ట్ర‌మంతా స‌ర్వ‌త్రా ఆస‌క్తి

Bandi Sai Bhagirath | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భ‌గీర‌థ్ పరారీ అయిన‌ట్లు విశ్వ‌సనీయ స‌మాచారం. ఆదివారం ఉద‌యం నుంచి భ‌గీర‌థ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే బండి భ‌గీర‌థ్ ఎక్క‌డికి వెళ్లారు..? అత‌ను త‌న ఫోన్ ఎందుకు స్విచ్ఛాఫ్ చేసుకోవాల్సి వ‌చ్చింద‌నే దానిపై ఆయా రాజ‌కీయ పార్టీల నేత‌లు ప్ర‌శ్నించుకుంటున్న‌ట్టు స‌మాచారం. ప‌రారీ అయిన బండి భ‌గీర‌థ్‌పై పోలీసుల త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉంటాయ‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఓ మైన‌ర్ బాలిక‌పై బండి భ‌గీర‌థ్ లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణలు వ‌చ్చిన‌ నేప‌థ్యంలో భ‌గీర‌థ్‌పై పేట్‌బ‌షీరాబాద్ పోలీసు స్టేష‌న్‌లో పోక్సో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే తాజాగా ల‌భించిన స‌మాచారం ప్ర‌కారం.. బాధిత అమ్మాయి మైన‌ర్ అనేది అధికారికంగా నిర్ధార‌ణ అయిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఈ క్ర‌మంలోనే బాధితురాలిని భ‌రోసా సెంట‌ర్‌కు త‌ర‌లించారు. బాధిత బాలిక‌పై లైంగిక దాడి జ‌రిగింద‌నేది నిజ‌మ‌ని తేలితే త‌దుపరి చ‌ర్య‌ల‌కు పోలీసులు సిద్ధం కానున్నారు.

ఫిర్యాదు అనంత‌రం చోటు చేసుకున్న‌ ప‌రిణామాలపై బండి సాయి భగీర‌థ్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. ఆదివారం ఉద‌యం నుంచి భ‌గీర‌థ్ ఫోన్ స్విచ్ఛాప్‌గా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ట్లు విశ్వ‌సనీయ స‌మాచారం. త‌దుప‌రి ఈ కేసులో ఏం జ‌రుగుతుంద‌నే అంశంపై ఆయా పార్టీల‌కు చెందిన‌ రాజ‌కీయ నేత‌ల‌తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌లు సర్వ‌త్రా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement