త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | కాంగ్రెస్ ప్ర‌భుత్వ రాక్ష‌స‌త్వం గురించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి తెలుసుకోండి..!

P

Telangana | Published On Mar 2, 2026, 6.31 pm IST

Bandi Sanjay | కాంగ్రెస్ ప్ర‌భుత్వ రాక్ష‌స‌త్వం గురించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి తెలుసుకోండి..!
Advertisement
  • రాహుల్ కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ సూచ‌న‌
  • ఆల‌యాల‌పై దాడుల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్‌
  • హైడ్రా బాధితుల‌ను క‌ల‌వాల‌న్న కేంద్ర‌మంత్రి
  • హిందువులు ఐక్యం కావాల‌ని పిలుపు

Bandi Sanjay | హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ఇళ్ల కూల్చివేయ‌డంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. పేదల కోసం గృహ నిర్మాణాలు చేపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి విరుద్ధంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న సామాన్యుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. పెద్దల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, కేవలం బలహీన వర్గాల గృహాలపైనే దృష్టి పెట్టడం ఎందుకని నిల‌దీశారు. అన్యాయంగా కూల్చివేతలను అడ్డుకునేందుకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, పేదల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. ఇటీవ‌ల రాష్ట్రంలో ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళ‌న వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ ఆలయం నుంచి చాంద్రాయణగుట్ట హనుమాన్ దేవాలయం వరకు జరిగిన ఘటనలను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పించారు. భక్తి వ్యక్తిగత అంశమే అయినా.. ధర్మంపై దాడి జరిగినప్పుడు సమాజం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉంద‌న్నారు.

హిందూ సమాజం ఐక్యంగా నిలబడకపోతే ఇలాంటి ఘటనలు మ‌ళ్లీ మ‌ళ్లీ జరుగుతాయన్నారు. బాన్సువాడలో హిందూ యువకుల అరెస్టులపై కూడా బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి హిందువులు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన హిందూ నేతలు కూడా తమ వైఖరిని పునఃపరిశీలించుకోవాల‌న్నారు. రక్షణ కోసం కేవలం కాషాయ పతాకంతో ముందుకు సాగాలని, ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు. శిక్షణా శిబిరాల పేరుతో తెలంగాణలో ఈ డ్రామాలు ఆపండి అంటూ రాహుల్‌కు సూచించారు. మొద‌ట హైడ్రా, మూసీ బాధితులను ప‌రామ‌ర్శించాల‌న్నారు. ముత్యాలమ్మ, హనుమాన్ దేవాలయాలపై జరిగిన దాడులకు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. బాన్సువాడలో జరిగిన దారుణ ఘటనకు గురైన బాధితులను క‌ల‌వాల‌ని.. ఒకవైపు పేదల ఇండ్లను, మరోవైపు హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షసత్వం గురించి.. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకోవాల‌న్నారు.

Advertisement
Advertisement