Bandi Sanjay | దేశంలో ఉండాలంటే.. అందరూ వందేమాతరం ఆలపించాల్సిందే : బండి సంజయ్
Bandi Sanjay | దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో వందేమాతరం ఆలాపాన సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోవడం సరికాదు అని ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌లో గురువారం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.
వందేమాతరం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు వెళ్లిపోయారు. కేంద్రం ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు తప్పని కూడా స్పీకర్ చెప్పలేని పరిస్థితి. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి. దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందే. అసదుద్దీన్ ఒవైసీ నడిపే కళాశాలల్లో ఉగ్రమూలాలు ఉన్నాయని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అని స్పష్టం చేస్తూ.. ఒకవేళ తాము అధికారంలో ఉండి ఉంటే ఎంఐఎం నేతల మెడలు వంచి వందేమాతరం పాడించేవాళ్లమని, అప్పటికీ వినకపోతే కటకటాల వెనక్కి నెట్టేవాళ్లం. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి తలొగ్గి, వారి మోచేతి నీళ్లు తాగుతోంది. దేశ సమగ్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని బండి సంజయ్ నిలదీశారు.
ఇదే క్రమంలో స్పీకర్ నిర్ణయాలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ బీ-ఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని, పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ వైఖరి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చట్టసభల పవిత్రతను కాపాడటంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



