Union Cabinet | గుడే బెల్లూర్-మహబూబ్‌నగర్ మధ్య నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Cabinet | తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గుడే బెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ (Gude Bellur-Mahabubnagar) సెక్షన్ మధ్య నాలుగు లైన్ల రోడ్డు (four lane road) నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
Union Cabinet | ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union Cabinet) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గుడే బెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ (Gude Bellur-Mahabubnagar) సెక్షన్ మధ్య నాలుగు లైన్ల రోడ్డు (four lane road) నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ (Hyderabad-Panaji Economic Corridor)లో భాగంగా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. 80 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3175 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం గుడే బెల్లూర్-మహబూబ్‌నగర్ మధ్య ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. రోడ్డు మలుపులు సరిగ్గా లేకపోవడం, గుడె బెల్లూర్, మాగనూర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లేర్, యెలిగండ్ల, బండార్‌పల్లి వంటి రద్దీగా ఉండే పట్టణాల గుండా ప్రయాణించాల్సి వస్తోంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ రహదారిని నాలుగు లేన్ల మార్గంగా అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






