Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..
Nvidia | అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఎన్‌విడియా భారత్‌లో తన జిఫోర్స్ నౌ (GeForce Now) క్లౌడ్ గేమింగ్ సేవలను మంగళవారం ప్రారంభించింది. ఈ సేవలను లాంచ్ చేసినట్లు ప్రకటించిన ఎన్‌విడియా బుధవారం ఉదయం నుంచి ఎర్లీ యాక్సెస్ బీటా దశను ముగించి అందరు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
Technology | Published On Jul 14, 2026, 5.21 pm IST
Nvidia | అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఎన్‌విడియా భారత్‌లో తన జిఫోర్స్ నౌ (GeForce Now) క్లౌడ్ గేమింగ్ సేవలను మంగళవారం ప్రారంభించింది. ఈ సేవలను లాంచ్ చేసినట్లు ప్రకటించిన ఎన్‌విడియా బుధవారం ఉదయం నుంచి ఎర్లీ యాక్సెస్ బీటా దశను ముగించి అందరు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు వెయిట్‌లిస్ట్‌లో చేరాల్సిన అవసరం ఉండగా, ఇకపై గేమర్లు నేరుగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుని సేవలను ఉపయోగించుకోవచ్చు. జూలై 15న ఉదయం 7:30 గంటల నుంచి వినియోగదారులకు రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. పర్‌ఫార్మెన్స్ ప్లాన్ నెలకు రూ.999, అల్టిమేట్ ప్లాన్ నెలకు రూ.1,999 ధరతో లభిస్తాయి. అలాగే ఒక రోజు ఉపయోగించుకునే డే పాస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. పర్‌ఫార్మెన్స్ డే పాస్ ధర రూ.399, అల్టిమేట్ డే పాస్ ధరను రూ.799గా నిర్ణయించారు.
ఎర్లీ పాస్ తీసుకున్న వారికి రాయితీ..
ఇప్పటికే ఎర్లీ పాస్ తీసుకున్న వినియోగదారులకు వారి ప్రస్తుత ప్లాన్ ముగిసిన తర్వాత మొదటి మూడు నెలల పాటు 20 శాతం ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి వారికి ఒక వారం గడువు ఉంటుంది. చెల్లింపుల విషయంలో కూడా ఎన్‌విడియా భారత వినియోగదారులకు సౌకర్యం కల్పించింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో పాటు ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా సబ్‌స్క్రిప్షన్‌లు, డే పాస్‌లకు చెల్లింపులు చేయవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఉచిత ప్రకటనల ఆధారిత (ఫ్రీ యాడ్ సపోర్టెడ్) ప్లాన్ ప్రస్తావన ఉన్నప్పటికీ, అది కూడా బుధవారం నుంచే అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయాన్ని సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పర్‌ఫార్మెన్స్ ప్లాన్ ద్వారా వినియోగదారులు గరిష్ఠంగా 1440పి రిజల్యూషన్‌లో 60 ఎఫ్‌పీఎస్ వరకు క్లౌడ్ గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఒక్కో సెషన్‌కు 6 గంటల గేమింగ్ సమయం, అలాగే ప్రాధాన్యత యాక్సెస్ లభిస్తుంది.
5కె రిజల్యూషన్‌తో గేమింగ్..
అల్టిమేట్ ప్లాన్‌లో అయితే 5కె రిజల్యూషన్‌లో 120 ఎఫ్‌పీఎస్ వరకు గేమింగ్‌కు మద్దతు ఉంటుంది. ఈ ప్లాన్‌లో మొదటి ప్రాధాన్యత యాక్సెస్‌తోపాటు ఒక్కో సెషన్‌కు 8 గంటల గేమింగ్ కు అవకాశం లభిస్తుంది. జిఫోర్స్ నౌ సేవలో 16-కోర్ వి-సీపీయూ, 56 జీబీ డీఆర్‌ఏఎం, ఎన్‌విడియా ఆర్‌టీఎక్స్ రే-ట్రేసింగ్, హెచ్‌డీఆర్10, ఎస్‌డీఆర్10, అలాగే అల్ట్రావైడ్ మానిటర్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఈ క్లౌడ్ గేమింగ్ సేవ ఎన్‌విడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5080 సూపర్‌పాడ్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఇవి బ్లాక్‌వెల్ ఆర్‌టీఎక్స్ ఆర్కిటెక్చర్ పై నిర్మాణం అయ్యాయి. 62 టెరాఫ్లాప్స్ కంప్యూట్ సామర్థ్యంతోపాటు 48 జీబీ ఫ్రేమ్ బఫర్ ను అందిస్తాయి. జిఫోర్స్ నౌ ద్వారా 4,500కు పైగా రెడీ-టు-ప్లే, ఇన్‌స్టాల్-టు-ప్లే గేమ్‌లను ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సేవకు సొంత గేమ్ లైబ్రరీ ఉండదు. వినియోగదారులు తమ స్టీమ్, ఎపిక్ గేమ్స్ వంటి గేమింగ్ అకౌంట్‌లను లింక్ చేసి, ఇప్పటికే కొనుగోలు చేసిన లేదా అందుబాటులో ఉన్న గేమ్‌లను క్లౌడ్ ద్వారా ఆడాల్సి ఉంటుంది.
ప్లాన్ల వివరాలు..
సబ్‌స్క్రైబర్లకు ఒక్కో సెషన్‌కు 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. అదనపు స్టోరేజ్ అవసరమైతే నెలకు రూ.299తో 200 జీబీ, రూ.499తో 500 జీబీ, రూ.799తో 1 టీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్-టు-ప్లే గేమ్‌లను కూడా ఈ స్టోరేజ్ కోటాలోనే లెక్కిస్తారు. అయితే ఎన్‌విడియా ప్రకటించిన ఈ ప్లాన్‌లతో సాధారణ వినియోగదారులు కూడా తమకు కావాలనుకున్నప్పుడు సబ్ స్క్రిప్షన్ తీసుకుని భారీ గ్రాఫిక్స్ కలిగిన గేమ్స్‌ను అత్యధిక రిజల్యూషన్‌తో, పూర్తి క్వాలిటీతో ఆడవచ్చు. సాధారణంగా అలాంటి గేమ్స్‌ను ఆడాలంటే ఖరీదైన పరికరాలు (పీసీ లేదా ప్లే స్టేషన్ వంటివి) అవసరం అవుతాయి. కానీ అదంతా అవసరం లేకుండా నెలవారి సబ్ స్క్రిప్షన్‌తో ఏ కంప్యూటర్‌లో అయినా సరే గేమ్స్‌ను ఆడుకోవచ్చు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేదా సపోర్ట్ అందిస్తున్న గేమ్స్ వివరాల కోసం ఎన్‌విడియా క్లౌడ్ గేమింగ్ అధికారిక వెబ్ పేజ్‌ను సందర్శించాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
- ●Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్
- ●Eggs Prices | హైదరాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. డజన్ రూ. 100 పైనే..!
- ●AI | ఏఐపై ప్రపంచ నిపుణుల హెచ్చరిక.. లక్షల ఉద్యోగాలకు ముప్పు..
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - టీవీకే పార్టీ ప్రత్యర్థి నిర్మాత - కోలీవుడ్‌లో కొత్త రూమర్?

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?

Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు

Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్

Eggs Prices | హైదరాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. డజన్ రూ. 100 పైనే..!




