Mahesh Goud | తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు: మహేశ్ గౌడ్
Mahesh Goud | తెలంగాణలో మరో విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్నాయని శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తోడుగా వరంగల్, ఆదిలాబాద్‌లో రెండు ఎయిర్‌పోర్టులు రానున్నాయని చెప్పారు.
Mahesh Goud | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో మరో విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్నాయని శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తోడుగా వరంగల్, ఆదిలాబాద్‌లో రెండు ఎయిర్‌పోర్టులు రానున్నాయని చెప్పారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన మహేశ్ గౌడ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుడూ..
`గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశను చూపింది. గవర్నర్ ప్రసంగంపై విపక్షాల వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనకు అద్దం పట్టేలా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం సాగింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దిశను స్పష్టంగా ప్రతిబింబించింది. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గవర్నర్ వివరంగా వివరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గవర్నర్ ప్రస్తావించడాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తు మా ప్రయాణం కొనసాగుతున్నది. ఇందిరమ్మ రాజ్యంలో సకల జనులు సంతోషంగా ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. వారి భవిష్యత్తుకు మరింత పునాదులు వేయడానికి మా ముఖ్యమంత్రి నిరంతరం తాపత్రయం పడుతున్నారు. నిత్యం 18 గంటలు పనిచేస్తు అప్పుల తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు.
రూ.16 వేల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సోనియమ్మ ఇస్తే.. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసి మా చేతికి ఇచ్చింది. అయినా మా ముఖ్యమంత్రి, మంత్రివర్గం గుండె ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. సర్వశక్తులు కూడగట్టుకుని ఒక్కొకొ ఇటుక పేరుస్తు రైజింగ్ తెలంగాణ వైపు అడుగులు వేయిస్తున్నారు. తెలంగాణను దేశంలో నంబర్ వన్‌గా చేయడానికి మా ముఖ్యమంత్రి నడుం బిగించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఆయన అడుగులు వేయిస్తున్నారు. మా పోటీ చెన్నై, బెంగళూరు, ముంబైతో కాదు.. టోక్యో, సింగపూర్, నూయార్క్‌తో అని చెప్పి మరి ఆ వైపుగా పరుగులు తీయిస్తున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తంగా చేశాం. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించాం.. ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిం ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల బయో ఏషియా 2026 అంతర్జాయతీ సదస్సు నిర్వహించి మరో రూ.1700 కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చాం.
డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. ఫాం హౌస్‌లో పట్టుబడింది మీ నాయకులు కాదా?. డ్రగ్స్ టెస్ట్‌కి సీఎం రేవంత్ సిద్ధం. కేసీఆర్ కూడా డ్రగ్స్ టెస్ట్‌కి రావాలి. ప్రజా ప్రతిందులందరూ డ్రగ్స్ టెస్ట్‌కి రావాలి. చట్టం అందరికీ సమానమే. ఇందులో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు.
వరంగల్, ఆదిలాబాద్ ప్రజలు చాలాకాలంగా విమానాశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలు అవసరం ఉన్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలే. కేంద్రంతో నిరంతరం సంప్రదించి ఎయిర్‌పోర్టులను ఓ కొలిక్కి తీసుకొచ్చాం. వరంగల్‌లో భూసేకరణ కూడా జరిగింది. భూమిని కేంద్ర ప్రభుత్వానికి, విమానాశ్రయాల సంస్థకు అందించాం. ఆదిలాబాద్‌లో త్వరలో భూసేకరణ జరుగనుంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో అదనంగా రెండు విమానాశ్రయాలు రాబోతున్నాయి.
రైతంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే రైతు. వ్యవసాయానికి పట్టం కట్టింది కాంగ్రెస్. దేశంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన చరిత్ర తమ పార్టీదే. గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది. తమ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలో 67,763 పోస్టులు భర్తీ చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమే. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 40 వేలు కూడా దాటలే. ఉద్యోగులు మా ప్రభుత్వానికి ఆప్తులు.` అని మహేశ్ గౌడ్ చెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



