త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | జాతీయ ర‌హ‌దారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు..

Road Accident | న‌ల్ల‌గొండ జిల్లా పాన‌గ‌ల్ స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున పాన‌గ‌ల్ వ‌ద్ద‌ అద్దంకి బైపాస్ రోడ్డుపై పంచ‌ర్ అవ‌డంతో ఓ లారీ (టీఎస్ 07 జీజే 8693) ఆగిపోయింది.

G

Telangana | Published On Apr 27, 2026, 11.53 am IST

Road Accident | జాతీయ ర‌హ‌దారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు..
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లా పాన‌గ‌ల్ స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున పాన‌గ‌ల్ వ‌ద్ద‌ అద్దంకి బైపాస్ రోడ్డుపై పంచ‌ర్ అవ‌డంతో ఓ లారీ (టీఎస్ 07 జీజే 8693) ఆగిపోయింది. దానిని వెనుక‌నుంచి ఓ కారు వ‌చ్చి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న సందీప్ అనే వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని అతిక‌ష్టంపై అందులోనుంచి వెలికితీశారు. సందీప్ నరసరావుపేట నుంచి హైదరాబాద్కు వ‌స్తుండగా ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

సూర్యాపేట జిల్లాలో జ‌రిగిన మరో ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతగిరి మండలం శాంతినగర్ వ‌ద్ద‌.. మటన్ ఆర్డర్కు పోతుండగా ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో తెలపాటి సైదులు అనే వ్యక్తి మ‌ర‌ణించారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. గాయపడిన ముగ్గురూ.. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

మెద‌క్ జిల్లా మాసాయి పేట వ‌ద్ద జాతీయ‌ర‌హ‌దారిపై ట్రావెల్స్ బ‌స్సు ద‌గ్ధ‌మ‌యింది. అయితే బ‌స్సులో ప్ర‌యాణికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. బ‌స్సు మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సు డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్నారు. ఈ మూడు ఘ‌ట‌న‌ల‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement