Tula Uma | బీజేపీ డీఎన్‌ఏలోనే మహిళా వ్యతిరేకత: తుల ఉమ
Tula Uma | మహిళా శక్తికి మోదీ సర్కార్ వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ నేత తుల ఉమ (Tula Uma) విమర్శించారు. పార్లమెంట్‌లో జరిగింది ప్రజాస్వామ్య విజయం కాదని, బీజేపీ (BJP) ఆడిన కపట నాటకమని మండిపడ్డారు.
Tula Uma | త్రినేత్ర.న్యూస్: మహిళా శక్తికి మోదీ సర్కార్ వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ నేత తుల ఉమ (Tula Uma) విమర్శించారు. పార్లమెంట్‌లో జరిగింది ప్రజాస్వామ్య విజయం కాదని, బీజేపీ (BJP) ఆడిన కపట నాటకమని మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఇన్నాళ్లూ ఊరించి, తీరా పార్లమెంటులో బిల్లును వీగిపోయేలా చేసిన బీజేపీ తీరును తీవ్రంగా ఖండించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం ఆడిన ఈ డ్రామా భారతదేశ మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో తిరుగులేని మెజారిటీ ఉందని చెప్పుకునే బీజేపీ సర్కార్, కీలకమైన రాజ్యాంగ సవరణకు కావాల్సిన 2/3 వంతు మెజారిటీని (352 ఓట్లు) సాధించలేకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. 528 మంది సభ్యులు హాజరైన సభలో కేవలం 298 ఓట్లు మాత్రమే సాధించారంటే, సొంత కూటమి సభ్యులను కూడా ఒప్పించలేని స్థితిలో మోదీ ఉన్నారా అని ప్రశ్నించారు. కావాలనే బిల్లును పడగొట్టేలా తెర వెనుక డ్రామా నడిపించారా అని నిలదీశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే మహిళా వ్యతిరేకత ఉంది. డీలిమిటేషన్ పేరుతో కొత్త మెలికలు పెట్టి, బిల్లును అటకెక్కించడం ద్వారా మహిళా రిజర్వేషన్లపై మీకు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.
`ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం 'మహిళా శక్తి' అని నినాదాలు చేయడం, తీరా సభలో ఓటింగ్ సమయానికి వెనకడుగు వేయడం మీ నైజం. 528 మంది సభ్యులు హాజరైతే, కేవలం 298 ఓట్లు మాత్రమే రావడం వెనుక అంతర్గత ఒప్పందాలు ఏంటో ప్రజలకు తెలియదా?. తెలంగాణలో మహిళా నాయకత్వాన్ని అణిచివేయాలని చూస్తున్న బిజెపికి, ఈ బిల్లు ఓటమి ఒక పెద్ద మాయని మచ్చ. మహిళల రిజర్వేషన్ల విషయంలో మీ ద్వంద్వ వైఖరిని ఊరూరా ఎండగడతాం.
అసలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అనే ముడి ఎందుకు పెట్టారు?. 2024లోనే అమలు చేయొచ్చు కదా? అమలు చేసే ఉద్దేశం లేకే, బిల్లు వీగిపోయేలా కుట్ర పన్ని ఇప్పుడు విపక్షాలపై నెట్టడం మీ నైజం. రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడం అంటే.. మహిళా సాధికారతకు ఉరితాడు వేయడమే. మెజారిటీ ఉండి కూడా బిల్లును నెగ్గించుకోలేకపోయారంటే, మీరు మహిళలకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరని అర్థం. మోదీ గారు.. ఇది మహిళా లోకంపై మీరు చేసిన చారిత్రక ద్రోహం. మీకు నిజంగా మహిళలపై ప్రేమ ఉంటే, డీలిమిటేషన్, ఇతర నిబంధనలు లేకుండా వెంటనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని గ్యారెంటీ ఇవ్వగలరా?. చేతకానితనాన్ని విపక్షాల మీదకు నెట్టడం ఆపి, నైతిక బాధ్యత వహించండి. బీజేపీ అంటేనే `భారతీయ జుమ్లా పార్టీ`. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడం చేతగాక, ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. దేశంలోని మహిళలు గమనిస్తున్నారు.. పార్లమెంట్‌లో మీరు ఆడిన ఈ కపట నాటకానికి రాబోయే రోజుల్లో మహిళలే మీకు బుద్ధి చెబుతారు.` అని తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






