త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lakshmi Deepika | మ‌న గ్రూప్‌-1 టాపర్‌కు.. ఏపీలోనూ డిప్యూటీ క‌లెక్ట‌ర్ పోస్టు

Lakshmi Deepika | క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ఉంటే ఎలాంటి ల‌క్ష్యాన్నైనా సులభంగా సాధించ‌వ‌చ్చ‌ని ల‌క్ష్మీ దీపిక కొమిరెడ్డి (Lakshmi Deepika) నిరూపించారు. టీజీపీఎస్సీ నిర్వ‌హించిన గ్రూప్‌-1లో టాప‌ర్‌గా (TGPSC Group 1 Topper) నిలిచిన ఆమె.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్‌-1లోనూ మొద‌టి స్థానం సాధించారు.

G

Telangana | Published On Feb 1, 2026, 12.30 pm IST

Lakshmi Deepika | మ‌న గ్రూప్‌-1 టాపర్‌కు.. ఏపీలోనూ డిప్యూటీ క‌లెక్ట‌ర్ పోస్టు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ఉంటే ఎలాంటి ల‌క్ష్యాన్నైనా సులభంగా సాధించ‌వ‌చ్చ‌ని ల‌క్ష్మీ దీపిక కొమిరెడ్డి (Lakshmi Deepika) నిరూపించారు. టీజీపీఎస్సీ నిర్వ‌హించిన గ్రూప్‌-1లో టాప‌ర్‌గా (TGPSC Group 1 Topper) నిలిచిన ఆమె.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్‌-1లోనూ మొద‌టి స్థానం సాధించారు. రెండు చోట్లా ఆమెకు డిప్యూటీ క‌లెక్ట‌ర్ పోస్టు వ‌రించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్ప‌టికే ఆమె తెలంగాణ‌లో డిప్యూటీ క‌లెక్ట‌ర్ శిక్ష‌ణ‌లో ఉన్నారు.

ఎలాంటి కోచింగ్ లేకుండా టీజీపీఎస్సీ నిర్వ‌హించిన గ్రూప్‌-1లో తొలిప్ర‌య‌త్నంలోనే అగ్ర‌స్థానం సాధించిన దీపిక‌.. నాన్‌లోక‌ల్ కోటాలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప‌రీక్ష రాశారు. అక్క‌డ కూడా టాప్ ప్లేస్‌లో నిలిచి త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్నారు. దీపిక తండ్రి కృష్ణ‌ది కోన‌సిమ్మ జిల్లా అమ‌లాపురం, త‌ల్లి ప‌ద్మావ‌తి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన వారు. అయితే వారు హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌లో స్థిప‌డ్డారు. దీపిక ఇక్క‌డే పుట్టి, పెరిగింది. దీంతో ఆమె తెలంగాణలో లోకల్ కాగా, ఏపీలో స్థానికేత‌రులుగా మారారు.

పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని సఫిల్‌గూడ డీఏవీ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ నారాయణగూడలోని శ్రీచైతన్యలో కాలేజీలో చదివారు. 2013లో మెడిసిన్‌లో 119 ర్యాంకు సాధించి ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అయితే సివిల్స్‌ లక్ష్యంగా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న ఆమె.. 2023లో ఏపీ గ్రూప్‌-1 ఫలితాల్లో ఎంపీడీఓ పోస్టు వచ్చినా అక్క‌డ చేర‌కుండా యూపీఎస్సీపైనే దృష్టికేంద్రీక‌రించారు. రెండు సార్లు ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్లారు. ఈ క్ర‌మంలో ఎలాంటి కోచింగ్ లేకుండానే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 టాపర్‌గా నిలిచారు.

గ్రూప్‌-1 పరీక్ష తీరు పరిశీలించాక శిక్షణ తీసుకోకుండానే సన్నద్ధమయ్యాయ‌న‌ని దీపిక వెల్ల‌డించారు. గ్రూప్స్‌లో ఆప్ష‌న‌ల్ సబ్జెక్టు ఉండడకపోవడంతో జనరల్‌ స్టడీస్‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాన‌ని, పరీక్షల సమయంలో రోజుకు 6 గంటల చొప్పున ప్రిప‌రేష‌న్‌కు కేటాయించాన‌ని తెలిపారు. ప్రజా సేవ చేయాలన్నదే త‌న‌ ఆకాంక్ష అని, అందుకే సివిల్స్‌కు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

Advertisement
Advertisement