త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tunga Balu | ఒక్క నోటిఫికేషనూ లేదు.. వయో పరిమితి పెంచలేదు..

Tunga Balu | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)ని అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. తుంగ బాలు అన్నారు. ఆదివారం ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

S

Telangana | Published On May 3, 2026, 12.33 pm IST

Tunga Balu | ఒక్క నోటిఫికేషనూ లేదు.. వయో పరిమితి పెంచలేదు..
Advertisement

Tunga Balu | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)ని అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. తుంగ బాలు అన్నారు. ఆదివారం ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు గరిష్ట వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న‌ 44 నుంచి 46 ఏళ్ల‌కు పెంచాలని, అదేవిధంగా జోవో నంబర్ 30 ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నార‌ని అన్నారు. వివిధ ఇనిస్టిట్యూట్ లలో చదువుతూ ప్రభుత్వం ఇవ్వ‌నున్న‌ నోటిఫికేషన్ లపై ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నార‌ని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరకాలం అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేద‌ని అన్నారు. దీంతో వయోపరిమితి సడలింపు లభిస్తుందన్న ఆశతో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న ఎంతో మందికి నష్టం జరుగుతుంద‌న్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ నిరుద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని, కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్ కింద అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పరీక్ష విధానంలో 20 స్థానాలను భర్తీ చేయడానికి విద్యార్హతల‌ను, వయోపరిమితిని ప్రకటించార‌ని పేర్కొన్నారు.

ఆ నోటిఫికేషన్ లో 18 నుండి 34 సంవత్సరాల మధ్య వ‌య‌స్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నార‌ని, వయోపరిమితి సడలింపును ఎస్సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరికి చెందిన వారికి 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 3 ఏళ్లు విధించింద‌ని తెలిపారు. గతంలో ఇవే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 44 సంవత్సరాల వ‌య‌స్సు ఉన్న వారికి కూడా అర్హత కల్పించింద‌న్నారు. కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ల‌లో వయోపరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు నష్ట పోతార‌ని తెలిపారు. అందువ‌ల్ల పాత పద్ధతిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement