త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బ‌య‌టివారి పెత్త‌నం ఎక్కువైంది

Rajagopal Reddy | నిజ‌మైన కాంగ్రెస్ నేత‌ల‌ను అణిచివేస్తున్నారని.. బయట నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పాన‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆత్మగౌరవం కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామన్నారు.

S

Telangana | Published On Aug 14, 2026, 2.04 pm IST

Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బ‌య‌టివారి పెత్త‌నం ఎక్కువైంది
Advertisement
  • నేనెక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు.. విమర్శించ‌ను కూడా
  • సీమాంధ్ర పాల‌కులు, సీమాంధ్ర మీడియా చేతుల్లో ఉంచి పార్టీ న‌డ‌పొద్దు
  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి

Rajagopal Reddy | త్రినేత్ర‌.న్యూస్: నిజ‌మైన కాంగ్రెస్ నేత‌ల‌ను అణిచివేస్తున్నారని.. బయట నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పాన‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆత్మగౌరవం కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నడపవద్దని కోరారు. చౌటుప్పల్ లోని సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయ‌న శుక్ర‌వారం పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నిన్న చేసిన వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు క్లారిటీ ఇచ్చిచారు.

ప్రజా పాలన అంటే పేదల కోసం పని చేయాలి. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, సీమాంధ్ర నాయకుల కోసం కాదు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నేనెక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు.. విమర్శించ‌ను కూడా. బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పా. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారనే విషయం గుర్తు చేశా.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో భాగంగా ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలి. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్ తోనే సాధ్యం అని రాజ‌గోపాల్‌రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement