TRS vs TRS | కవిత పార్టీపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు.. కారణం ఇదే..!
TRS vs TRS | కల్వకుంట్ల కవితకు ఆదిలోనే ఊహించని షాక్ ఎదురైంది. కొత్త పార్టీ ప్రకటించిన నాలుగు రోజులకే కవిత పార్టీపై టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో కవితతో పాటు ఆ పార్టీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు సమాచారం.
TRS vs TRS | త్రినేత్ర.న్యూస్ : కల్వకుంట్ల కవితకు ఆదిలోనే ఊహించని షాక్ ఎదురైంది. కొత్త పార్టీ ప్రకటించిన నాలుగు రోజులకే కవిత పార్టీపై టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో కవితతో పాటు ఆ పార్టీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కవిత పార్టీపై బీఆర్ఎస్ నిప్పులు గక్కుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కూడా రేపోమాపో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ కూడా ఫిర్యాదు చేస్తే.. కవితకు ఈ వ్యవహారం మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఫిర్యాదుకు కారణం ఇదే..!
తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్) పార్టీ 2023లో సికింద్రాబాద్ అడ్రస్‌తో రిజిస్టర్ అయింది. ఈ పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం. ఇక కవిత పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్).. బాలరంగం పార్టీ పేరు కూడా తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్).. పేర్లు వేరు అయినప్పటికీ.. అబ్రివేషన్లు ఒకే మాదిరిగా ఉండడం సమస్యగా మారింది. దీంతో తమ టీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని, ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరు రిజిస్టర్ చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నెల 27న బాలరంగం లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత సొంత పార్టీని పెట్టుకుంటున్నట్లు ప్రకటించారని ఆ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ రాజ్య సమితి పేరుతో (టీఆర్ఎస్) పార్టీని దాదాపు నాలుగేండ్లుగా తాను నిర్వహిస్తున్నానని, టీఆర్ఎస్ అనే మూడు అక్షరాల అబ్రివేషన్ (ఆక్రోనిమ్)పై తనకు హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



